Rains: వచ్చే మూడు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
తెలంగాణలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అచంనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, జనగాము, ములుగు, నిజామాబాద్, కామారెడ్డిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఇక శనివారం తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు గురు, శుక్ర, శనివారలు, మిగిలిన జిల్లాలకు శనివారానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 24 గంటల్లో బలపడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిస్సా, ఛత్తీస్గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని అంచనా వేసింది.

దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అదిలాబాద్, కొమరంభీమ్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలంగాణలో దాదాపు 19వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలిపాటి వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, చైతన్యపురి తేలిపాటి జల్లులు పడ్డాయి. ఈ అల్పపీడన ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications