Chicken Price: కొండెక్కిన కోడి.. ఎవరెస్ట్ ఎక్కిన గుడ్డు..!

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎప్పుడు లేని విధంగా రేట్లు. ముక్క లేనిదే బుగ్గ దిగని వారికి చికెన్ ధర చూసి అవాక్కు అవుతున్నారు. కిలో చికెన్ తీసుకెళ్లేవారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు. 20 రోజుల క్రితం లైవ్ కోడి కిలో రూ.110 నుంచి రూ.120 పలికింది. ఇక స్కిన్ లెస్ కేజీ రూ.180 నుంచి రూ.200 పలికింది. కానీ ఇప్పుడు ధరలు అమాంతం పెరిగాయి.

ఇప్పుడు స్కిన్ లెస్ కిలో రూ.300 పలుకుతుంటే.. లైవ్ కోడి రూ.150 నుంచి రూ.170 కి పెరిగింది. మేడారం సమ్మక్క జాతర కారణంగా డిమాండ్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఎండల తీవ్ర ఎక్కువ ఉండడంతో కోళ్ల ఉత్పత్తి కూడా తగ్గినట్లు చెబుతున్నారు. దీని వల్ల చికెన్ కు డిమాండ్ పెరిగి ధర పెరిగినట్లు వివరిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో రోజుకు 8 వేల టన్నుల నుంచి 10 వేల టన్నుల చికెన్ విక్రయిస్తుంటారు.

The prices of chicken and eggs in Telangana have gone up hugely

ఇది దసరా, సంక్రాంతి, రంజాన్‌ సమయంలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు పెరుగుతుందట. అయితే ఈసారి ఎండలు ఫిబ్రవరిలో పెరిగిపోవడంతో కోళ్లు చనిపోతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో అక్కడ కొద్ది రోజులు పౌల్ట్రీ ఫారమ్ లు మూసివేశారు. దీంతో తెలంగాణ నుంచి ఏపీకి కోళ్లు వెళ్లడం కూడా ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

చికెన్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గినట్లు నిర్వహకులు చెబుతున్నారు. అయితే చికెన్ కు బదులుగా కోడి గుడ్లు కొందమనకుంటే వాటి ధర కూడా భారీగా పెరిగింది. రిటైలన్ ఒక్కో గుడ్డు రూ.6.50 నుంచి రూ.7 పలుకుతోంది. ఇటు చికెన్ ధర, అటు కోడి గుడ్డు ధరలు భారీగా పెరగడం జనం ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే కిలో చికెన్ కు బదులుగా అరకిలో మటన్ తెచ్చకుని తింటున్నారు. ఇక బిర్యానీ సెంటర్ వారు బిర్యానీలో చికెన్ క్వాంటిటీ తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాన్ వెజ్ లో తప్పక వాడాల్సిన వెల్లుల్లి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెల్లుల్లి రూ.400 పలుకుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+