ఉగ్రవాదం పెరగటానికి బీజేపీ కారణం ,కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రండి .. తలసాని సంచలనం

తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తుందని ఉగ్రవాదం దేశంలో పెరగటానికి బీజేపీయే ప్రధాన కారణం అని ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యారు, ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే అర్హత లేదని విరుచుకుపడ్డారు. గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడాలి కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్

దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడాలి కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్

సోమవారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఈవీఎంలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవలేదా అంటూ ప్రశ్నించారు. 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయిందన్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు విమర్శలు మాని ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలని హితవు పలికారు. తమ పాలన బాగుంది కాబట్టే ప్రజలు మళ్లీ పట్టంకట్టారని చెప్పుకొచ్చారు.

ఉగ్రవాదం పెరగటానికి బీజేపీనే కారణం .. తలసాని

ఉగ్రవాదం పెరగటానికి బీజేపీనే కారణం .. తలసాని

మరోవైపు బీజేపీపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లోనే చావు దెబ్బ తిన్నా ఇంకా బీజేపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని ఆరోపించిన శ్రీనివాస్ యాదవ్ అభినందన్‌ను వదలకపోతే పాక్‌కు కాళరాత్రేనని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం బాధ్యతా రాహిత్యమన్నారు.

దత్తాత్రేయ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవాలన్న తలసాని

దత్తాత్రేయ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవాలన్న తలసాని

దత్తాత్రేయ రిటైర్ అయి ఇంట్లో కూర్చొవాలని సూచించారు. ఇంకా ఆయనకు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు.భద్రత, ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రధాని బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. ప్రతి అంశాన్నీ ఎంఐఎంతో ముడిపెట్టి మాట్లాడటం బీజేపీ నేతలకు సరికాదన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+