TSRTC: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణలు ఖండించిన ఆర్టీసీ ..
ఆర్మూర్ లో ఆర్టీసీకి సంబంధించిన స్థలం లీజుకు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్యకు సంబంధించిన కన్స్ ట్రాక్షన్ కంపెనీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించింది.
అందులో సినిమా హాళ్లు, పలు షాపులు ఉన్నాయి. అయితే లీజుకు సంబంధించి అద్దె చెల్లించకపోవడంతో ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. అయినా కూడా అద్దె చెల్లించకపోవడంతో షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్టీసీపై పలు ఆరోపణలు చేశారు. దీనిపై ఆర్టీసీ స్పందించింది.
జీవన్ రెడ్డి ఆరోపణలను ఖండించారు. జీవన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. జీవన్ రెడ్డి ఇష్టానుసారంగా నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే సంస్థ వదిలేస్తోందని పేర్కొంది. అద్దె బకాయిల విషయంలో లీజ్ ఒప్పందం, హైకోర్టు ఆదేశాల ప్రకారమే సంస్థ నడుచుకుంటోందని వివరించింది. బకాయిలు చెల్లించాలని గత 5 ఏళ్లుగా 20కి పైగా నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.

తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని జీవన్ రెడ్డి ఆరోపించడంలో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది. జీఎస్టీ కేంద్రానికి చెల్లించడం లేదనడం పూర్తి అర్ధరహితమన్నారు. నిబంధనల ప్రకారమే క్రమం జీఎస్టీ చెల్లిస్తున్నట్లు స్పష్టం చేసింది. బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడటం లేదను పేర్కొంది. నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ*
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) May 11, 2024
పత్రికా ప్రకటన - తేదీ: 11.05.2024
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) అద్దెకు ఇస్తూ ఒక ఒప్పందం…
కొన్ని సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని 7059 చదరపు గజాల భూమిని విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టీఎస్‌ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ప్రత్యామ్నాయ రెవెన్యూ పెంచుకునేందుకు గాను ౩౩ సంవత్సరాలకు బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్(బీవోటీ) కింద2013న ఆ భూమిని లీజ్‌కు ఇచ్చారు.












Click it and Unblock the Notifications