ఐటీ ఉద్యోగుల కష్టాలకు చెక్- ఊహించని నిర్ణయం..!!

హైదరాబాద్ నడి బొడ్డున మరో భారీ ప్లాన్ సిద్దం అవుతోంది. హైదరాబాద్‌- సైబరాబాద్‌ అనుసంధానం దిశగా ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ కష్టాలకు చెక్ పెట్టే నిర్ణయం జరుగుతోంది. ఓఆర్‌ఆర్‌కు వేగంగా చేరేందుకూ మార్గం సుగమం కానుంది. నగరం నడి బొడ్డున ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఏడు కిలో మీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి.. అండర్ పాస్ తో నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

ప్రభుత్వం సైబరాబాద్ కేంద్రంగా కీలక నిర్ణయం పై కసరత్తు చేస్తోంది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టడంతోపాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు(ఓఆర్‌ఆర్‌)కు వేగంగా చేరేందుకు వీలుగా కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది.

the-state-govt-directs-to-prepare-plans-for-new-expressway-in-it-corridor-details-here

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్‌ వరకు పది కిలోమీటర్ల మేర ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం పై అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు చేపట్టిన పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. నగరంలో సైబరాబాద్ - హైదరాబాద్ మధ్య పెరిగిన ట్రాఫిక్.. రాకపోకల వేళ ఈ క్స ప్రెస్ వే అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రధానంగా.. ఐటీ కారిడార్‌ నుంచి నగరం మధ్యలోకి వచ్చే మార్గాలు, కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న రోడ్లు, పాత ముంబై రోడ్డు కొనసాగే ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12 నుంచి ఫిలింనగర్‌, జడ్జీస్‌ కాలనీ, దుర్గంచెరువు, టీ-హబ్‌, గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్‌ సమీపంలోని ఫ్లైఓవర్‌ వరకు ఈ మార్గాన్ని నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఓఆర్‌ఆర్‌ నుంచి నేరుగా, వేగంగా నగరం మధ్యలోకి రాకపోకలకు ఈ మార్గం వీలుకల్పిస్తుంది. సుమారు ఆరేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల స్టీల్‌ బ్రిడ్జిని, అవసరమైన ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లను నిర్మించి.. వాహనాలు వేగంగా వెళ్లేలా దీనిని నిర్మించనున్నారు. సర్వే బాధ్యతలను ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇప్పటికే రోడ్డు ఉన్న ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌ నిర్మాణం, అవసరమైన చోట రోడ్డు నిర్మాణం సాధ్యాసాధ్యాలు, ఎక్కడెక్కడ అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేయాలి.. అనే అంశాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. త్వరలోనే ప్రభుత్వం ఈ కన్సెల్టెన్సీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆమోద ముద్ర వేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+