సుప్రీంకోర్టు సీరియస్, ఎమ్మెల్యేల అనర్హతపై కీలక ఆదేశాలు..!!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పై సుప్రీకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. మూడు నెలల గడువుతో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం సూచనలు చేసింది. ఆ సమయం పూర్తయినా నిర్ణయం తీసుకోకపోవటం పై బీఆర్ఎస్ మరోసారి సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన విచారణ సమయంలో స్పీకర్ కు సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పైన రోజు వారీ విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నిర్ణయం ప్రకటించాలని సూచించినా.. ఆలస్యం చేయటం పైన సుప్రీం కోర్టు సీరియస్ అయింది. దీంతో.. బీఆర్ఎస్ తాజాగా దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సమయం లో సుప్రీం స్పీకర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.

The Supreme court key orders for Telangana Assembly Speaker to clear MLA s disqualification petitions

నాలుగు వారాల్లోగా ఎమ్మెల్యేల పై అనర్హత పిటీషన్ల విచారణ పూర్తి చేయాలని నిర్దేశించింది. ఇదే సమయంలో మీరు నిర్ణయం తీసుకుంటారా.. మేము తీసుకోవాలా అంటూ సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేస్తామని కోర్టుకు స్పష్టం చేసారు. ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+