High Court: నంబర్ ప్లేట్ లేకుంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చా..!
నంబర్ ప్లేట్ లేకుండా బైక్ నడిపినందకు క్రిమినల్ కేసు పెడతారా అంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించారు. ఓ వ్యక్తి నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడితే ఇష్టమొచ్చిన సెక్షన్ల కింద కేసు పెడతారా అంటూ నిలదీసింది. నంబరు ప్లేట్ లేకుండా బైక్ నడిపినందుకు ఆర్ వసుంధరాచారిపై నమోదైన క్రిమినల్ కేసును తెలంగాణ హైకోర్టు జస్టిస్ కె సుజనా కొట్టివేశారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్, గుల్జార్ హౌజ్ వద్ద వాహన తనిఖీ నిర్వహిస్తుండగా, చారి బైక్‌ను ఆపి, నంబర్ ప్లేట్ మిస్సింగ్ గురించి ప్రశ్నించారు.
ఆ తర్వాత SI చారిపై IPC సెక్షన్ 420 (మోసం), మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 80(a) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై వసుందరా చారి హైకోర్టును ఆశ్రయించారు. చారి తరఫున ఆకాశ్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. రైడర్‌పై చీటింగ్ కేసును కొట్టివేయడం సాధ్యం కాదని, ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అసలు మోసం చేసినట్లు రుజువైతే తప్ప IPC సెక్షన్ 420 కింద చీటింగ్ అభియోగాన్ని సమర్థించలేమని కోర్టుకు తెలిపారు.

మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 80(ఎ) ప్రకారం వాహనాలు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌లను ప్రదర్శించాల్సి ఉంటుందని, అలా చేయడంలో విఫలమైనందుకు జరిమానాలు విధించవచ్చని వివరించాడు. ఇరువైపుల వాదనలు విన్న రాష్ట ఉన్నత న్యాయస్థానం ఈ నేరం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 420 పరిధిలోకి రాదన్నారు. అంతేకాకుండా, సెక్షన్ 80(ఏ) కింద శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ అభియోగాలు మోపారని.. ఇది సరికాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పోలీసులు ఇంకా స్పందించలేదు.












Click it and Unblock the Notifications