ఆస్తికోసం భర్త అంత్యక్రియలను ఆపేసిన భార్య..!
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలనేవి కనుమరుగైపోతున్నాయి. ఆస్తి కోసం కొడుకులు తల్లిదండ్రులను కడతేర్చిన సంఘటనలను చాలానే చూశాం. కానీ, ఓ భార్య మాత్రం ఆస్తికోసం తన భర్త అంత్యక్రియలను మూడురోజులపాటు ఆపివేసింది. ఈ అమానవీయ ఘటన తెలంగాణలోని యాదాద్రిలో జరిగింది. రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో ఓ భార్య తన భర్త అంత్యక్రియలనే అడ్డుకుంది. కుటుంబంలో వచ్చిన ఆస్తి తగాదాల కారణంగా భర్త అంత్యక్రియలు మూడురోజులుగా నిలిచిపోయాయి.
పూర్తి వివరాలిలా ఉన్నాయి...జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి (48) హైదరాబాద్‌లో గత కొన్సి సంవత్సరాలుగా ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, తమ స్వగ్రామమైన పంతంగిలో హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డికి 7.24 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి తండ్రి పేరు మీదే ఉంది. అయితే తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలంటూ నర్సిరెడ్డ ఇద్దరు కూతుళ్లు కో్ర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా హనుమంతరెడ్డి, తమ్ముడు కరుణాకర్‌రెడ్డి, తన ఇద్దరు చెల్లెళ్లకు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో తీవ్ర మానసిక క్షోభను అనుభవించిన హనుమంతరెడ్డి జూన్ 8వ తేదిన శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవనర్మణానికి పాల్పడ్డాడు.

కేసును విత్‌డ్రా చేసుకుంటేనే..
హనుమంతరెడ్డి మృతి అనంతరం జరగాల్సిన కార్యక్రమాల కోసం, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తన భర్త మృతికి ఆడపడుచులు, కరుణాకర్‌రెడ్డి కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హనుమంతరెడ్డి ఇద్దరు చెల్లెళ్లతో పాటు తన తమ్ముడిపై కూడా కేసు నమోదైంది. కేసు విషయంలో తీవ్రంగా భయపడ్డ నర్సిరెడ్డి ఇద్దరు కూతుళ్లు, తమ్ముడు ఆ కేసును ఉపసంహరించుకోవాలని బంధువుల ద్వారా స్వప్నపై ఒత్తిడి తెచ్చారు. అయితే, హనుమంతరెడ్డి భార్య మాత్రం ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే తాను కేసు విత్ డ్రా చేసుకోవటంతోపాటు భర్త అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పేసింది. ఈ విషయం తేలేదాకా అంత్యక్రియలు చేయబోమని, కేసు విత్ డ్రా చేసుకోమని స్నప్న కుటుంబీకులు కూడా తేల్చిచెప్పారు. నిన్న (సోమవారం) కోర్టు టైం అయిపోవడంతో అంత్యక్రియలు జరగలేదు. నేడు కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాతనే అంత్యక్రియలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని వారంతా తేల్చిచెప్పారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications