Rains: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలే..!
హైదరాబాద్ ను గత మూడు రోజులుగా వర్షాలు ముంచెత్తున్నాయి. శని, ఆదివారాలు పలు చోట్లు అతి భారీ వర్షాలు కురవగా.. సోమవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. అమీర్ పేట్, మైత్రి వనం, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, బంజారాహిల్స్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఉరుములు, మెరుపులు
రాగల మూడు రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భల మీదుగా పశ్చిమ మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది.












Click it and Unblock the Notifications