వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిస్టరీ రిపీట్స్ అంటే ఇదే..! మందకృష్ణ మాదిగ మళ్లీ హౌస్ అరెస్ట్...!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలకు పాలాభీషేకాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగకు మళ్లీ చుక్కెదురైంది. అంబేద్కర్ ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిన్న చూపు చూస్తున్నారని ఆరోపిస్తూ అందుకు నిరశనగా ఈనెల 22 రాష్ట్ర వ్యాప్త నిరశనలకు పిలుపునిచ్చిన మందక్రిష్ణ పై తెలంగాణ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.

ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలో ఆయన నివాసం ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామునే ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు మందకృష్ణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్భందించారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కృష్ణమాదిగ అరెస్ట్‌ను ఎమ్మార్పీఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నియంతాల వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడుతున్నారు.

this is called History repeats.!Manda krishna House arrest again..!!

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ జయంత్యుత్సవాల్లో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని మందకృష్ణ మాదిగ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దళితుడైనందునే అంబేడ్కర్‌ను సీఎం అవమానించారన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 16న అన్ని జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

కేసీఆర్‌ అనారోగ్య సమస్యలతోనూ బాధపడటం లేదని, జయంతి రోజునే ప్రగతి భవన్‌లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అగ్రకులస్థుడైన ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్‌ వస్తే పాదాభివందనం చేసిన కేసీఆర్‌, దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌తో మాత్రం కరచాలనం చేశారని గుర్తు చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

English summary
Police arrived in the house early on Wednesday and locked mrps national president Manda krishna madiga out of the house. He was heavily deployed at his residence. Embarasses leaders are furiously faced with the arrest of Krishna madiga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X