రేవంత్ వెంట వెళ్లే బ్యాచ్ ఇదే?: బాబు నమ్మకానికి పెద్ద నామం పెట్టినట్టేనా!..
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చుట్టూ అల్లబడుతున్న ఊహాగానాలకు జోరుగా ప్రచారం లభిస్తోంది. ఎప్పుడైతే ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారో.. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయ కథనాలన్ని ఆయన పార
హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి చుట్టూ అల్లబడుతున్న ఊహాగానాలకు జోరుగా ప్రచారం లభిస్తోంది. ఎప్పుడైతే ఆయన ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారో.. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయ కథనాలన్ని ఆయన పార్టీ మార్పు అంశం చుట్టే తిరుగుతున్నాయి.
రేవంత్ కాంగ్రెస్ గూటికి ఎప్పుడు చేరుతారు?.. ఒకవేళ చేరితే ఎవరెవరిని వెంటబెట్టుకుని వెళ్తారన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో కాకలు తీరిన రాజకీయ నాయకులు చాలామందే ఉన్నందునా.. అక్కడ తన రాజకీయాలకు ఎలాంటి ఢోకా లేకుండా ఉండేందుకు రేవంత్ బాగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తనవైపు తిప్పుకున్న రేవంత్:
ఇందులో భాగంగానే టీడీపీ నుంచి 25మందిని వెంటబెట్టుకుని రేవంత్ పార్టీ వీడుతున్నట్టు, ఆ జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ 25మందికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనే షరతుతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనేది ఆ జాబితాతో ముడిపడి ఉన్న కథనం.
టీటీడీపీలో ఉంటూనే స్వతంత్ర పోకడలు అవలంభిస్తూ వచ్చిన రేవంత్.. సీనియర్లతో ఉంటూనే గ్రూపు రాజకీయాలు నడిపినట్టు ఈ జాబితా చూస్తే అర్థమవుతోంది. తొలి నుంచి తనకు అనుకూలంగా ఉండేలా కొంతమంది నేతలను తనవైపు తిప్పుకున్న రేవంత్.. ఇప్పుడా నేతలతో కూడిన జాబితానే కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో పెట్టినట్టు సమాచారం.

బాబు నమ్మకాన్ని అలా.. ముందుచూపుతో!:
మోత్కుపల్లి, అరవింద్ గౌడ్ లాంటి సీనియర్లు రేవంత్ మోసం చేశారని మొత్తుకుంటుంటే.. పార్టీలోని మరో వర్గం మాత్రం రేవంత్ కు అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాగూ టీడీపీని నమ్ముకుంటే భవిష్యత్తు కష్టమే అన్న నిర్ణయానికి వారంతా వచ్చేశారు.
ఆ ఆలోచనతోనే రేవంత్ తో జతకట్టి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు రేవంత్‌పై పెట్టిన నమ్మకాన్ని రేవంత్ మరో విధంగా ఉపయోగించుకున్నారు. ఇటు పార్టీలో కొనసాగుతూనే.. భవిష్యత్తు మీద ముందుచూపుతో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకునే ప్లాన్ లో నిమగ్నమయ్యారు. తత్ఫలితంగానే ఇప్పుడీ జాబితా బయటకొచ్చింది.

రేవంత్ వెంట వెళ్లే బ్యాచ్:
రావిశ్రీనివాస్ (కాగజ్ నగర్-ఓసీ), వడ్డేపల్లి సుభాష్ రెడ్డి(కామారెడ్డి-ఓసీ), పెద్దిరెడ్డి(ఓసీ-హుజురాబాద్), సీహెచ్.విజయ రమణారావు(ఓసీ-పెద్దపల్లి),డా.కవంపల్లి సత్యనారాయణరావు(ఎస్సీ-మానకొండూరు), మేడిపల్లి సత్యం(ఎస్సీ- చొప్పదండి), సండ్ర వెంకట వీరయ్య(ఎస్సీ-సత్తుపల్లి), కొత్తకోట దయాకర్ రెడ్డి(ఓసీ-మక్తల్), ఎర్ర చంద్రశేఖర్(బీసీ-మహబూబ్ నగర్),
బోడ జనార్దన్(ఎస్సీ-చెన్నూరు), ఒంటేరు ప్రతాప్ రెడ్డి(ఓసీ-గజ్వేల్), గడిల శ్రీకాంత్ గౌడ్(పటాన్ చెరు-బీసీ), పటేల్ రమేష్ రెడ్డి(ఓసీ-సూర్యాపేట), కంచర్ల భూపాల్ రెడ్డి(ఓసీ-నల్గొండ), బీల్యా నాయక్(ఎస్టీ-దేవరకొండ), అరికాల నర్సా రెడ్డి(ఓసీ-నిజామాబాద్ రూరల్), దొడోళ్ల రాజారాం యాదవ్(బీసీ-బాల్కొండ), సీతక్క(ఎస్టీ-ములుగు), వేం నరేందర్ రెడ్డి(ఓసీ-వరంగల్), గండ్ర సత్యనారాయణ రావు(ఓసీ-భూపాలపల్లి)

టీడీపీ భూస్థాపితమేనా?:
మొత్తం మీద ఇంతమందిని వెంటపెట్టుకుని వెళ్లి రేవంత్ టీడీపీ పార్టీని భూస్థాపితం చేయడానికే నిశ్చయించుకున్నట్టు ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్య కూడా రేవంత్ తో వెళ్లిపోతే.. ఇక ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనట్టే. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కృష్ణయ్య కూడా ఎప్పటినుంచో స్వతంత్రంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న ఆయనను టీడీపీ నేతగా చెప్పుకునే పరిస్థితి లేదు. దీంతో టీడీపీ పూర్తిగా 'జీరో'గా మిగిలిపోయే పరిస్థితి.
ఇదిలా ఉంటే, రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ కు ఇచ్చిన లిస్టులో మహబూబ్ నగర్ టీడీపీ అధ్యక్షుడు ఎర్ర చంద్రశేఖర్ పేరు కూడా ఉంది. అయితే రేవంత్ వెంట వెళ్లేది లేదని ఆయన శనివారం మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications