అంతు చూస్తాం.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి బెదిరింపులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మీకి అర్ధరాత్రి ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల ద్వారా ఓ దుండగుడు బెదిరింపులు చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెతో పాటు ఆమె తండ్రి రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావును కూడా గాయపరుచుతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ దుండగుడు గతంలో బోరబండలో మృతి చెందిన సర్దార్ అనే వ్యక్తికి తాను సంబంధించిన వాడినంటూ పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన బెదిరింపుల్లో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంతో, మేయర్ విజయలక్ష్మీ పీఆర్ఓ ఈ విషయాన్ని బంజారాహిల్స్ పోలీసులకు తెలియజేశారు.

పోలీసులు మేయర్‌కు వచ్చిన ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్‌ల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ చేసిన నంబర్‌ను ట్రేస్ చేయడానికి సాంకేతిక సహాయం తీసుకుంటున్నారు. త్వరలోనే ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై మేయర్ భద్రత పెంచే అంశాన్ని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం












Click it and Unblock the Notifications