వాతావరణం: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటలలో నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం(22వ తేదీన) అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఈ అల్పపీడనం మరింత బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవాశముందని పేర్కొంది. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరానికి 26వ తేదీ ఉదయం చేరుకొనే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి వీస్తాయని పేర్కొంది. రాగల 3 రోజులు (20,21,22వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాగా, రాగల 3 రోజులు (20,21,22వ తేదీలు) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు(గంటకి 30 నుండి 40 కి.మి వేగంతో)తో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. తెలంగాణాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశములలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది వాతావరణ శాఖ. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications