Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గురువారం గ్రాండ్ రిలీజ్..! ఆశావ‌హుల‌ భ‌విష్య‌త్తు తేలేది రేపే..!! అమ‌రావ‌తికి ర‌మ‌ణ‌..!

హైద‌రాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎన్నిక‌ల బ‌రిలో ఉండే ఆశావ‌హుల భ‌విష్య‌త్తు మ‌రికొద్ది గంట‌ల్లో తేల‌నుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను మ‌రిపిస్తున్న మ‌హాకూట‌మిలో టీడిపి సీట్ల స‌ర్ధుబాటుతో పాటు అభ్య‌ర్థుల ఖ‌రారు మ‌రికొన్ని గంట‌ల్లో ప్ర‌క‌టించ‌నుంది టీడిపి అదిష్టానం. ఇందుకోసం గ‌త కొన్ని రోజులుగా డైలి సిరియ‌ల్ ఎపిసోడ్ ల మాదిరిగా మ‌మాకూట‌మి నేత‌లు చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కోరుకున్న నియోజ‌క వ‌ర్గాలు, పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థుల‌ను టీడిపి జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఎంపిక చేయ‌నున్నారు.

 రేపే తేల‌నున్న టీడిపి ఆశావ‌హుల భ‌విష్య‌త్తు..! జాబితాతో అమ‌రావ‌తికి ర‌మ‌ణ‌..!!

రేపే తేల‌నున్న టీడిపి ఆశావ‌హుల భ‌విష్య‌త్తు..! జాబితాతో అమ‌రావ‌తికి ర‌మ‌ణ‌..!!

టీడిపి గ‌తంలో గెలిచిన నియోజ‌క వ‌ర్గాలు, రెండ‌వ స్థానంలో నిలిచిన అభ్య‌ర్థులతో పాటు 2004 నుండి పార్టీకి నిస్వార్థ సేవ చేస్తున్న నాయ‌కుల‌కు అవ‌కాశం క‌ల్సించే దిశ‌గా టీడిపి అదిష్టానం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని గ‌తంలో పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు పార్టీ ముఖ్య నేత‌ల‌కు వివ‌రించ‌న‌ట్టు తెలుస్తోంది. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌ధ్యంలో తెలుగుదేశం పార్టీ త‌రుపున బ‌రిలో నిల‌బ‌డే నేత‌ల‌ను ఫైన‌లైజ్ చేసి ప్ర‌చారానికి తెల‌ర‌తీసేంద‌కు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉవ్విళ్లూరుతున్న‌ట్టు స‌మాచారం.

 చివ‌రి ఘ‌ట్టానికి అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌..! ఉండేదెవ‌రో..! ఊడేదెవ‌రో..!

చివ‌రి ఘ‌ట్టానికి అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌..! ఉండేదెవ‌రో..! ఊడేదెవ‌రో..!

మ‌హాకూట‌మి సీట్ల స‌ర్దుబాటు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. శుక్ర‌వారం రోజున అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చెప్తున్నారు. గురువారం రోజున టీటిడిపి అధ్య‌క్షులు ఎల్ ర‌మ‌ణ ఏపీ సిఎం చంద్ర‌బాబు తో స‌మావేశం కాబోతున్నారు. కూటమిలో టీడిపి పోటీ చేసే స్థానాలు, అభ్య‌ర్థుల పై చ‌ర్చించ‌నున్నారు. తెలంగాణలో డిసెంబ‌ర్ ఏడున జ‌రిగే ఎన్న‌కల్లో పోటీ చేసేందుకు ప్ర‌జాకూట‌మి పేరుతో కాంగ్రెస్, టీడిపి, తెలంగాణ‌ జ‌న‌సమితి, సిపిఐ లు క‌లిసి పోటీ చేస్తున్నాయి.

టీడిపి కి మ‌రో రెండు సీట్లు పెరిగే ఛాన్స్,..! క‌స‌ర‌త్తు చేస్తున్న అదిష్టానం..!

టీడిపి కి మ‌రో రెండు సీట్లు పెరిగే ఛాన్స్,..! క‌స‌ర‌త్తు చేస్తున్న అదిష్టానం..!

ఇప్ప‌టికే దాదాపు ఏ పార్టీ ఎన్నిసీట్లు పోటీ చేయ‌నుంద‌నే దానిపై క్లారిటీ వ‌చ్చినా, మ‌రికొని సీట్ల కోసం టీజేఎస్, సిపిఐ లు ప‌ట్టుప‌డ్తున్నాయి. ఇక టీడిపి విష‌యానికి వ‌స్తే 14 సీట్ల‌లో పోటీ చేస్తుంది. అయితే మ‌రో రెండు సీట్లు కూడా టిడిపి కి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే టీడిపి 14 స్థానాలు ఇస్తామ‌న్నా, ఇప్ప‌టికి ఏయే స్థానాలు అనే దానిపై స్ప‌ష్ట‌త పూర్తిగా రాలేదు. అయితే ఏపీ సిఎం చంద్ర‌బాబుతో జ‌రిగే భేటీలో టీటిడిపి పార్టీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ పోటీ చేసే స్థానం, అభ్య‌ర్థుల‌ను పైన‌ల్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

అభ్య‌ర్థులు తేలితే త‌ర్వాత ఘ‌ట్టం ప్ర‌చార‌మే..! ఉత్సాహంలో కూట‌మి నేత‌లు..!

అభ్య‌ర్థులు తేలితే త‌ర్వాత ఘ‌ట్టం ప్ర‌చార‌మే..! ఉత్సాహంలో కూట‌మి నేత‌లు..!

అంతేకాదు కొన్ని స్థానాల్లో ఇద్ద‌రు ముగ్గురు పోటీ ప‌డుతున్నారు. టికెట్ రాని వాళ్ళ‌ను సైతం ఎలా కాపాడు కోవాల‌నే దానిపై కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. అభ్య‌ర్థులు ఫైన‌ల్ అయితే తెలంగాణ‌లో ప్ర‌చారానికి ఏపీ సిఎం చంద్ర‌బాబుతో పాటూ ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా రానున్నారు.అయితే ఎక్క‌డ ప్ర‌చారం ఉంటుంది, ఏయే తేదీల్లో ఉంటుంద‌నే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే తెలంగాణ లో ఎన్నిక‌ల వేడి అభ్య‌ర్థుల ఎంపిక, మ‌హాకూట‌మిలో కీల‌క ప‌రిణామ‌లు చోటు చేసుకుంటున్న త‌రుణంలో బాబు తో ర‌మ‌ణ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+