సీట్ల చిచ్చు: వరంగల్ వెస్ట్‌పై రావు పద్మ అసంతృప్తి, బీజేపీ ఆఫీస్ వద్ద టెన్షన్ టెన్షన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలోను సీట్ల చిచ్చు రాజుకుంది. ఇప్పటి వరకు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలలో అసంతృప్తి జ్వాలలు చూస్తున్నాం. తెలంగాణలో అంతగా బలం లేని బీజేపీ కూడా ఇందుకు అతీతం కాదని వెల్లడైంది.

పలు జిల్లాల్లో అసంతృప్తి
బీజేపీలో రెండు దఫాలుగా అరవై మందికి పైగా అభ్యర్థులను ప్రకటించారు. మొదటి దఫాలో ఎలాంటి ఇబ్బందులు లేని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో 28 మంది పేర్లు విడుదల చేశారు. అయితే ఈ జాబితాపై నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో అసంతృప్తులు కనిపించాయి.

వరంగల్ వెస్ట్- రావు పద్మ అసంతృప్తి
వరంగల్ వెస్ట్ స్థానాన్ని ధర్మారావుకు కేటాయించారు. దీనిపై పార్టీ నాయకురాలు రావు పద్మ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్‌ను కలిసేందుకు వరంగల్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆరుసార్లు ఓడిపోయిన ధర్మారావుకు టిక్కెట్ ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. వరంగల్ వెస్ట్ టిక్కెట్ తనకు కేటాయించాలని కోరుతున్నారు.
హైదరాబాదులోను అసంతృప్తి
నిజామాబాద్ అర్బన్ టిక్కెట్‌ను యెండల లక్ష్మీనారాయణకు కేటాయించారు. ఇక్కడ టిక్కెట్ ఆశీస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్‌లోను కొన్ని చోట్ల అసంతృప్తులు కనిపిస్తున్నారు. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను యోగానంద్‌కు కేటాయించారు. దీనిపై స్థానిక నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications