పులి సంచారం.. ఆ మండలాల ప్రజలకు అలెర్ట్!
ఏపీ, తెలంగాణా రాష్ట్రాలలో ఇప్పుడు రెండు పులులు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒకపక్క తూర్పు గోదావరి జిల్లాలో పులి హల్చల్ చేస్తుంటే మరోపక్క తెలంగాణాలోని జనగామ జిల్లాలో సంచరిస్తున్న పులి పశువులను టార్గెట్ చేస్తుంది. దీంతో పాడి పశువులతో పాటు, తమను సైతం కాపాడుకోవటానికి పులి సంచరిస్తున్న ప్రాంతాలలోని ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
మండేల గూడెంలో పశువును చంపిన పులి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలము, మండేలగూడెం గ్రామ శివారులలో పులి సంచరిస్తున్నట్టు దాని అడుగుల ద్వారా గుర్తించినట్లు జనగామ మరియు హన్మకొండ అటవీ శాఖాదికారి లావణ్య ఈరోజు విడుదల చేసిన ప్రకటన లో తెలిపారు. పులి మండేల గూడెం లో ఒక పశువును చంపినట్లు గుర్తించినట్లు అటవీ అధికారి పేర్కొన్నారు.
చుట్టూ ప్రక్కన మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగాం, దేవరుప్పుల మరియు తరిగొప్పుల మొదలగు మండలాలలోని ప్రజలు అప్రమత్తముగా ఉండాలని,ఒంటరిగా బయట సంచరించవద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితులలో తప్ప మిగితా సమయాలలో బయటికి రావద్ద ని సూచించారు. ఒకవేళ అత్యవసరమైన పని ఉన్నచో గుంపు గుంపులుగా వెళ్ళాలని తెలిపారు.
రాత్రి వేళ ఇలా చెయ్యండి
పులి సంచారం చేసే ప్రాంతాల ప్రజలు రాత్రి సమయములో బయట తిరగకూడదని సూచించారు. రైతులు బావుల వద్ద ఉచ్చులను, కరెంటు వైర్లను అమర్చకూడదన్నా రు. పశువులను ఇంటివద్దనే సంరక్షించుకోవాలని కోరారు. ఏదయినా పులి సంచార సమాచారం తెలిసినట్లయితే ఫారెస్ట్ అధికారులకు, లేదా పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని అటవీ అధికారి లావణ్య కోరారు.
పులిని పట్టుకోవటానికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు
కాగా ఈ పులిని పట్టుకోవటానికి థర్మల్ డ్రోన్ లను ఉపయోగిస్తున్నారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి స్టేట్ లెవెల్లో స్పెషల్ టెక్నికల్ టీం ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, త్వరలోనే పులిని పట్టుకుంటాం అని అధికారులు చెప్తున్నారు. పులి అడుగు జాడలను గుర్తించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications