రేపటి నుంచి ఇక మీకన్నీ కేటీఆర్, అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడిన కేటీ రామారావును అభినందిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం తీర్మానం చేసింది. హైదరాబాదులో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ తీర్మానం చేశారు. అంతకుముందు కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా రేపటి నుంచి కేటీఆర్ పార్టీకి అందుబాటులో ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు.

రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం సరిగా లేదని, ఇక ముందు అన్ని విభాగాల నిర్మాణం జరగాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. తాను, కే కేశవ రావు జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉంటామని చెప్పారు. అందుకే కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.

 అందరూ సిద్ధంగా ఉండాలి

అందరూ సిద్ధంగా ఉండాలి

జాతీయస్థాయిలో ప్రజా పోరాటాలు, సైద్ధాంతిక పోరులో సిద్ధంగా ఉండాలని పార్టీ కేడర్‌కు కేసీఆర్ సూచించారు. అన్ని హామీలను నెరవేర్చాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకునేందుకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించినట్లు చెప్పారు. ప్రభుత్వానికి, పార్టీకి అనుసంధాన కర్తగా ఉంటారని తెలిపారు.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

రేపటి నుంచి అందుబాటులో కేటీఆర్

రేపటి నుంచి అందుబాటులో కేటీఆర్

రేపటి (శనివారం) నుంచి కేటీఆర్ మీకు (పార్టీకి) అందుబాటులో ఉంటారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పార్టీకి పూర్తిగా సమయం కేటాయిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికలకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని నేతలకు ఆయన సూచించారు. తొలుత పార్టీ సభ్యత్వంపై దృష్టి సారించాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలన్నారు.

 16 లోకసభ స్థానాలు గెలవాలి

16 లోకసభ స్థానాలు గెలవాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ సూచించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను హైదరాబాద్ మినహా 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని చెప్పారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి జనరల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను నియమిస్తామని చెప్పారు. రేపు మధ్యాహ్నం మరోసారి సమావేశం అవుదామని చెప్పారు.

నామినేటెడ్ పోస్టులు

నామినేటెడ్ పోస్టులు

పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగాలని కేసీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఇంచార్జిని నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. వచ్చే అయిదేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉండాలని చెప్పారు. కార్యాలయాల్లో శాఖల వారీగా సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+