Rakesh Master: కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..
టాలీవుడ్ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం విశాఖపట్నంలో షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఆదివారం అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం ఉదయం రక్త విరోచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.
సినిమాలకు దూరంగా ఉన్న ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నారు. ఆట డ్యాన్స్ షోతో డ్యాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన 1400 సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తన కెరీర్ ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేశారని ఆరోపిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో వదిలి రాకేష్ మాస్టర్ సోషల్ మీడియా ట్రెడ్ అయ్యారు.

ఆయన ఇష్టమొచ్చినట్లు మాట్లాడడతంతో రాకేష్ మతిస్థిమితం కోల్పోయారని చాలా మంది విమర్శించారు. రాకేష్ మాస్టర్ ప్రస్తుతం కొంత మందితో యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ జబర్దస్త్ కామెడీ షోలో కూడా పాల్గొన్నారు.
ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్న శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ శిష్యుడే. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి డ్యాన్ నేర్చుకునట్లు చెప్పాడు. ఆయన మరణం పట్ల పలువు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications