Tollywood Gossips: ప్రభాస్ పై బాలీవుడ్ మీడియా దుష్ప్రచారం..ఈ సమయంలో ఏంటలా..?

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఇండస్ట్రీ. ఇలాంటి పెద్ద ఇండస్ట్రీలో చాలా వరకు గాసిప్స్ ఉంటాయి. తాజాగా ప్రభాస్ పై కూడా ఓ గాసిప్ వినిపిస్తోంది. అది కూడా బాలీవుడ్ మీడియానే ఈ ప్రచారం చేస్తోంది. దీంతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్‌డేట్స్ మీకోసం

 IAF ఆఫీసర్‌గా వరుణ్ తేజ్

IAF ఆఫీసర్‌గా వరుణ్ తేజ్

మెగా కాంపౌండ్ నుంచి ఓ మెగా అప్‌డేట్ వచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ వెనుకాడడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో పలు మంచి చిత్రాలు చేసి ప్రేక్షకాదరణ పొందారు. ఇందులో గద్దల కొండ గణేష్, ఫిదా, కంచె లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. . సవాలుతో కూడిన క్యారెక్టర్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడే వరుణ్ తేజ్... త్వరలో మరో ఎక్స్‌పెరిమెంట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. యాడ్ ఫిల్మ్ మేకర్ అండ్ సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రంలో వరుణ్ నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌ రోల్ ప్లే చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది ఆ చిత్ర బృందం. యుద్ధ విమానాల మధ్య వరుణ్ తేజ్ నిలబడి ఉండటంతో కచ్చితంగా ఇది దేశానికి సంబంధించిన కథే అయి ఉంటుందని ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆ పోస్టర్‌లో వరుణ్ చూస్తే ఈ క్యారెక్టర్‌కు కరెక్ట్‌గా సూటయ్యాడు. ఇక ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ ఆఫీసర్ లుక్ కోసం వరుణ్ తేజ్ శిక్షణ తీసుకుంటున్నాడట.ఈ చిత్రం కచ్చితంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు అంకితమివ్వనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు యుద్ధ విమానంలో ఉన్న సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే దానిపై స్టోరీ లైన్ ఉన్నట్లు సమాచారం. నవంబర్ నుంచి VT-13 చిత్రం సెట్స్‌పైకి వెళుతుంది.2023లో ఈ చిత్రాన్ని తెలుగులో హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రభాస్ - కృతి సనన్‌ల మధ్య అదేదో..

ప్రభాస్ - కృతి సనన్‌ల మధ్య అదేదో..


కాంట్రవర్శీలకు దూరంగా ఉండేవారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఇప్పటి వరకు ఈ బాహుబలిపై ఎలాంటి రూమర్లు వచ్చిన దాఖలాలు లేవు. ప్రభాస్ ఇప్పుడో పాన్‌ఇండియా స్టార్. ఇక బాలీవుడ్ మీడియా ప్రభాస్ పై కొన్ని పుకార్లను పుట్టిస్తూ పరోక్షంగా ఈయన చిత్రం ఆదిపురుష్‌ను ప్రమోట్ చేస్తోంది. ప్రభాస్ తన ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియా ఓ ప్రచారం చేస్తోంది. సాధారణంగా ఓ సినిమాకు సంబంధించిన హీరో హీరోయిన్ల మధ్య అదేదో ఎవ్వారం నడుస్తోందంటూ ప్రచారం చేయడం బాలీవుడ్ మీడియాకు కామన్ అయిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కూడా ఈ మీడియా ప్రచారానికి బలయ్యాడు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - అందాల భామ కృతి సనన్‌లు ఆదిపురుష్ చిత్రం కోసం గత ఏడాదిగా షూటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ ప్రచారం మొదలుపెట్టింది. అది కూడా ఈ చిత్రం మరికొన్ని నెలల్లో రిలీజ్ కానుండటంతో ఒక విధంగా ఆదిపురుష్‌ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ ఇస్తోంది బాలీవుడ్ మీడియా. అయితే తన పెద్దనాన్న కృష్ణంరాజు మరణంతో కృంగిపోయి ఉన్న ప్రభాస్‌పై ఈ సమయంలో ఇలాంటి రూమర్లు రావడాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు

 రేణు దేశాయ్ బ్యాక్ ఆన్ స్క్రీన్

రేణు దేశాయ్ బ్యాక్ ఆన్ స్క్రీన్

రేణు దేశాయ్... ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరేమో. అపుడెప్పుడో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బద్రి, జానీ సినిమాల్లో నటించిన ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 18 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ మళ్లీ స్క్రీన్ పై కనిపించనున్నట్లు స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది. తన ఇన్స్‌టాగ్రామ్‌లో తాను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నట్లు పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ సినమా ఏంటంటారా...

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో హేమలత లావనం అనే క్యారెక్టర్‌ను పోషిస్తోందట రేణు దేశాయ్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని వంశీకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంత మంచి క్యారెక్టర్ తనను నమ్మి తనకు ఇచ్చినందుకు డెరెక్టర్‌కు థ్యాంక్స్ చెబుతూ ఇన్స్‌టాలో పోస్టు చేసుకొచ్చింది రేణు దేశాయ్. ఈ చిత్రంలో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ పక్కా కమర్షియల్ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+