Tollywood Updates:మహేష్ బాబు-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్ అప్పుడే..రౌడీ బాయ్ కహానీ క్యాహై..?

హైదరాబాద్ : మరో నెలలో కొన్ని పెద్ద సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. గాడ్ ఫాదర్ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ ఔట్ అవగా, మహేష్ బాబు విజయ్ దేవరకొండల చిత్రాలకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వచ్చాయి.

గాడ్‌ఫాదర్‌లో నయన్ ఫస్ట్ లుక్

గాడ్‌ఫాదర్‌లో నయన్ ఫస్ట్ లుక్

నయనతార... ఈ కొత్త పెళ్లి కూతరు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలకు సైన్ చేసిన ఈ మలయాలీ కుట్టి... పైళ్లయ్యాక భర్త విఘ్నేష్ శివన్‌తో హనీమూన్‌ ట్రిప్‌కు వెళ్లింది.దీంతో షూటింగ్స్‌కు కొంత గ్యాప్ ఇచ్చింది. నయనతార మెగాస్టార్ చిరంజీవి లీడ్‌ రోల్ చేస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్యారెక్టర్ పేరు సత్యప్రియ జైదేవ్. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు చెల్లెలిగా నయన్ నటిస్తోంది. తాజాగా నయన్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఇందులో నయన్ సంథింగ్ స్పెషల్‌గా కనిపించింది. కాటన్ శారీలో చాలా రాయల్ లుక్‌తో నయన్ కనిపిస్తోంది.ఓ టైప్ రైటర్‌పై ఏదో టైప్ చేస్తున్నట్లుగా పోస్టర్‌లో కనిపిస్తోంది.మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ మరో ఇంట్రెస్టింగ్‌ రోల్‌లో సందడి చేయనున్నాడు.థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 5న దసరా స్పెషల్‌గా ఈ చిత్రం విడుదల కానుంది.

హరీష్ శంకర్‌తో విజయ్ దేవరకొండ

హరీష్ శంకర్‌తో విజయ్ దేవరకొండ

లైగర్ ఫ్లాప్‌తో విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి సారించాడు. తన తదుపరి సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేశాడు. ప్రస్తుతం ఖుషీ చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ రౌడీ బాయ్. ఇందులో సమంతా హీరోయిన్‌గా చేస్తోంది.ఈ చిత్రాన్ని శివ నిర్వాన డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే ఖుషీ చిత్రం షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం.ఇక ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ టాప్ డైరెక్టర్ సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ మూవీ చేసే అవకాశాలున్నాయి.అయితే సుకుమార్‌ పుష్ప సీక్వెల్‌తో బిజీగా ఉండటంతో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు.

ఇక దిల్ రాజుతో ఓ మూవీకి కమిట్ అయ్యాడు విజయ్. అయితే ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందా అని దిల్‌ రాజు ఆలోచిస్తున్నారట. ఈ సమయంలోనే హరీష్ శంకర్ అయితే అద్భుతంగా ఉంటుందని మాస్‌ సినిమాలను తీయటంలో హరీష్ శంకర్‌ యాప్ట్‌గా సూట్ అవుతారని దిల్‌ రాజు భావిస్తున్నారట. ఈ క్రమంలోనే హరీష్ శంకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్‌ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో ఇప్పుడప్పుడే ఈ చిత్రం పట్టాలెక్కేలా లేదు. దీంతో విజయ్ దేవరకొండ ఖుషీ చిత్రం తర్వాత హరీష్ శంకర్‌తో సినిమా ట్రాక్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నట్లు సమాచారం.

 మహేష్ త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్

మహేష్ త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్

ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్. మహేష్ బాబు కొత్త సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందా అని ఎదురుచూస్తున్నవారికి ఇది నిజంగా ఫంటాస్టిక్ న్యూసే. మహేష్ బాబు -మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే అది ఎప్పుడు పట్టాలెక్కుతుందా అనేదానిపైనే క్లారిటీ లేదు.

ఎట్టకేలకు దీనిపై ఓ స్పష్టత వచ్చేసింది.ఈ నెల 12న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఓ స్పెషల్ సెట్‌లో హీరో మహేష్‌తో పాటు ఇతర యాక్టర్స్‌కూడా షూట్‌లో పాల్గొంటారట.ముందుగా ఓ ఫైట్ సీన్‌ను త్రివిక్రమ్ తీయనున్నారు.

ఇక అలవైకుంఠపురంలో మూవీ తర్వాత తివిక్రమ్ కూడా మెగాఫోన్ పట్టలేదు. తాజాగా మహేష్ చిత్రంతో మళ్లీ ఈ మ్యాజికల్ డైరెక్టర్ మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ కాంబోపై ఇటు మహేష్ ఫ్యాన్స్‌లో అటు త్రివిక్రమ్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.అంతేకాదు ఈ క్యారెక్టర్ కోసం మహేష్ బాబు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారట. కొంత మాస్ లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.

ఇక మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా... మరో హీరోయిన్‌గా శ్రీలీల ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.అయితే ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు. గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయాయి. అయితే తాజా చిత్రం ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక తమన్ నుంచి కూడా ఓ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఈ చిత్రం ద్వారా వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+