దేశంలోనే టాప్ 25 ఐపీఎస్ ల జాబితాలో చోటు ... టాప్ 4 స్థానంలో తెలంగాణా డీజీపీ
తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి అరుదైన ఘనత సాధించారు . ఇండియన్ పోలీస్ సర్వీస్ లో పని చేస్తున్న 4000 మంది ఐపీఎస్ అధికారులలో టాప్ 4లో ఆయన నిలిచారు . నేరాలను నియంత్రించే సామర్థ్యం, శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, నిజాయితీపై దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో ఈ ఫలితాలు రావటం విశేషం .

ఐపీఎస్ ల పని తీరుపై సర్వే : ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు
ఇక ఐపీఎస్ ల పని తీరుపై సర్వే చేసిన ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ సంస్థలు భారతదేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారులలో తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డికి చోటు కల్పించాయి. ఈ సర్వేలో ఇండియాలోని 4000 మంది ఐపీఎస్ అధికారుల జాబితాపై సర్వే నిర్వహించగా ఫైనల్ గా టాప్ 25 జాబితా తయారు చేశారు . తెలంగాణా రాష్ట్ర డీజీపీ టాప్ 25లో నాలుగవ స్థానం దక్కించుకున్నారు . టాప్ 25 ఐపీఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైనందుకు డీజీపీ మహేందర్‌రెడ్డిని మంత్రులు, ఐపీఎస్ అధికారులు అభినందించారు .

4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 4 గా నిలిచిన తెలంగాణా డీజీపీ
దాదాపు 4 వేలమంది అధికారుల జాబితాలో టాప్ 25 ఐపిఎస్ అధికారుల లిస్టు ఫైనల్ చేసింది సర్వే సంస్థ . పోలీసు అధికారుల అంతర్గత నివేదికలు, మీడియా నివేదికలు, నిర్ధిష్ట జిల్లాల్లో సదరు ఐపీఎస్ లకు సంబంధించిన మొదటి పోస్టింగ్ నుండి ప్రస్తుత హోదా వరకు కొలమానంగా నిర్వహించిన సర్వేలో డీజీపీ మహేందర్ రెడ్డి ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణా రాష్ట్రంలో పోలీస్ శాఖకు సంబంధించిన ఎలాంటి టాస్క్ అయినా చాలా సమర్ధంగా నిర్వహించారు అని సర్వే గుర్తించింది.

సర్వే వివరాలు వెల్లడించిన పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా
ఇక ఈ సర్వేపై పీఎస్‌యు వాచ్ మేనేజింగ్ ఎడిటర్ వివేక్ శుక్లా మాట్లాడారు. ఆయన తన మాటల్లో ఓ ఐపీఎస్ అధికారి కేవలం శాంతిభద్రతల నిర్వహణ మాత్రమే కాకుండా నక్సలిజం, ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలు, మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అనేక విచిత్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఇక అలాంటి టాస్క్ లన్నీ సమర్ధంగా నిర్వహించిన ఐపీఎస్ లను జల్లెడ పట్టి ఈ లిస్టు తయారు చెయ్యటం విశేషం .
Recommended Video

పోలీసుశాఖలో పనితీరులో డీజీపీ బెంచ్ మార్క్
ఈ జాబితాలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ అరవింద్‌కుమార్, రా చీఫ్ సమత్‌కుమార్ గోయల్, ఐటీబీపీ డీజీపీ ఎస్‌ఎస్ దేశ్వల్, సీఆర్పీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి, పలు రాష్ట్రాల డీజీపీ లు చోటు సంపాదించారు. పోలీసు సేవలో పనితీరు ద్వారా కొత్త తరానికి బెంచ్ మార్క్ సృష్టించిన టాప్ 25 ఐపిఎస్ అధికారులను పీఎస్‌యూ వాచ్ సంస్థ ఈ సర్వే ద్వారా గుర్తించింది. ఇక తెలంగాణా డీజీపీ విషయానికి వస్తే 1986 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మహేందర్‌రెడ్డి 2017లో తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.ప్రస్తుతం దేశంలోనే టాప్ 4 లో నిలిచారు .
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications