హైదరాబాద్ లో ఇంటి అద్దె తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇవే..!
హైదరాబాద్ మహానగరం విశ్వ నగరంగా అభివృద్ది చెందుతోంది. రియల్ ఎస్టేట్ రంగంతోపాటు ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. అలాగే బయో సైన్స్, లైఫ్ సైన్సెస్ రంగాలు, ఫార్మా రంగాలకు భాగ్యనగరం ముఖ్య వేదికగా నిలుస్తోంది. దీంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం, భద్రత నేపథ్యంలో ఈ నగరాన్ని ఎంచుకుంటున్నాయి పలు సంస్థలు. అయితే హైదరాబాద్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో భాగ్య నగరంలో ఇళ్లు, ఫ్లాట్ల స్థలాలు, ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగిపోయాయి.
అయితే ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, ఇతర కార్మికులు హైదరాబాద్ మహానగరంలో నివాసం ఉంటున్నారు. అయితే మరి హైదరాబాద్ లో ఇంటి అద్దె తక్కువగా ఉంటే ప్రాంతాలు ఏవి.. ఏ ప్రాంతాలు చౌకగా ఉన్నాయి అని పరిశీలిస్తే.. ఉప్పల్ ప్రాంతం చాల అనువైన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అపార్ట్ మెంట్ కాకుండా ఇండిపెండెంట్ ఇళ్లలో నివసించాలనుకునే మధ్య తరగతి, బ్యాచిలర్స్ కు అలాగే నగరానికి దూరంగా ఉండాలనుకునే వారికి ఈ ప్రాంతం అనువైనదిగా చెబుతారు.
ఉప్పల్ ప్రాంతంలో 1 BHK రెంట్ రూ. 4500 నుండి రూ. 7000 వరకు ఉన్నాయి.
అలాగే 2 BHK రెంట్ రూ. 11000 నుండి రూ. 16000 వరకు ఉన్నాయి. ఇక 3 BHK ఇళ్ల అద్దె రూ. 16000 నుండి రూ. 22000 వరకు ఉన్నాయి.
బేగంపేట కూడా అన్ని తరగతులవారు నివసించే ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ 1 BHK రెంట్ రూ. 4000 నుండి రూ. 17000 వరకు ఉన్నాయి. 2 BHK రూ. 12000 నుండి రూ. 26000 వరకు ఉన్నాయి. అలాగే 3 BHK రెంట్ చూసుకుంటే రూ. 16000 నుండి రూ. 36000 వరకు ఉన్నాయి.
సోమాజిగూడలో మంచి మౌలిక సదుపాయాలు, రవాణాకు అనుకూలంగా ఉంది. సోమాజిగూడకు వాణిజ్య ప్రాంతాలు అయిన పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్ చాల దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ 1 BHK అద్దె రూ. 6000 నుండి రూ. 8000 వరకు ఉంది. ఇక 2 BHK రెంట్ రూ. 12000 నుండి రూ. 28000 వరకు ఉంది. అలాగే 3 BHK రెంట్ రూ. 22000 నుండి రూ. 38000 వరకు ఉన్నాయి.

ఇక అమీర్ పేట్ ప్రాంతం విద్యార్ధులు, ఉద్యోగులకు చాల అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 BHK రెంట్ వివరాలు చూస్తే రూ. 6000 నుండి రూ. 11000 వరకు ఉంది. అలాగే 2 BHK రెంట్ చూస్తే రూ. 12000 నుండి రూ. 25000 వరకు ఉంది. ఇక 3 BHK రెంట్ ధర రూ. 22000 నుండి రూ. 70000 వరకు ఉన్నాయి.
అలాగే హైదరాబాద్ లోని మాదాపూర్ కూడా అధిక మౌలిక సదుపాయాలు కలిగిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. అంతేకాక మాదాపూర్ సమీపంలో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఇక్కడ చాల ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ప్రాంతంలో రెంట్స్ పరిశీలిస్తే.. 1 BHK అద్దె రూ. 10000 నుండి రూ. 22000 వరకు ఉంది. అలాగే 2 BHK రెంట్ చూసుకుంటే రూ. 22000 నుండి రూ. 35000 వరకు ఉంది. ఇక 3 BHK రెంట్ చూసుకుంటే రూ. 42000 నుండి రూ. 90000 వరకు ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications