న్యూ ఇయర్ వేళ.. బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు పర్యటకులు క్యూ..!

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు చాలా మంది గోవా, నార్త్ స్టేట్స్ కు వెళ్తుంటారు. ఇంకొంత మంది విదేశాల్లో ప్లాన్ చేస్తుంటారు. అయితే దట్టమైన అడవిలో చుట్టూ కొండలు.. జలపాతాలు.. పక్షుల కిలకిల రావాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ అందమైన దీవి లో ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం పర్యటకులు క్యూ కడుతున్నారు. అదే తెలంగాణ ములుగు జిల్లాలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్. ఈ ఐలాండ్ కు పర్యటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. తాడ్వాయి - పస్రా మధ్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ను ఏర్పాటు చేసింది తెలంగాణ టూరిజం శాఖ.

ప్రకృతి ప్రేమికులు, పర్యటకుల కోసం ములుగు జిల్లాలో బ్లాక్ బెర్రీ ఐలాండ్ ఏర్పాటైంది. రాష్ట్ర పర్యాటక శాఖ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ దీవిని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాడ్వాయ, పస్రా మధ్య గల దట్టమైన రిజర్వ్ ఫారెస్టులో ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్‌ ను ఏర్పాటు చేశారు. నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ దూరంలో జలగలంచ వాగులో ఈ ఐలాండ్ ను ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇసుక దిబ్బమీదనే ఈ దీవిని రూపొందించడం విశేషం.

ఆఫ్రికా, అమెరికా లాంటి దేశాల్లో ఉండే దీవులను తలపించేలా ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇండియన్ బ్లాక్ బెర్రీ చెట్లు ఉన్న నేపథ్యంలో దీనికి బ్లాక్ బెర్రీ ఐలాండ్ అనే పేరును పెట్టారు. తాజాగా ఈ ఐలాండ్ ను మంత్రి సీతక్క పునః ప్రారంభించారు. ఇది ఒక చక్కని పర్యాటక ప్రదేశమని అన్నారు. ఇక్కడి అటవీ ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయన్నారు.

Tourists Flock to Blackberry Island on New Year s Day in Mulugu District

ఇక ఈ దీవిలో పర్యాటకుల కోసం 58 హాట్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాట్ లో నలుగురు లేదా ముగ్గురు లేదా ఇద్దరు ఉండేలా ఏర్పాట్లు చేశారు. పక్కనే పారుతున్న వాగును స్విమ్మింగ్ పూల్ గా తీర్చిదిద్దారు. ఇక్కడే ఓ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడే ఆటల కోసం బీచ్ వాలీబాల్, ఆర్చరీ, షటిల్ లాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యటకుల తాకిడి నేపథ్యంలో గతేడాది కంటే ఈసారి మరిన్ని ఏర్పాట్లు చేశారు. పర్యటకులు ఈ బ్లాక్ బెర్రీ ఐలాండ్ కు వెళ్తే ఒక కొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన అనుభూతిని పొందే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+