జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడే వేళ బిగ్ ట్విస్ట్, ఇక తప్పదా..!!
జీవన్ రెడ్డి ఎపిసోడ్ లో మరో బిగ్ ట్విస్ట్. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో కీలకంగా పని చేసిన జీనవ్ రెడ్డి పార్టీని వీడాలని నిర్ణయించారు. ఇప్పటికే బీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ నుంచి ఇప్పటికే జీవన్ రెడ్డి ఆఫర్లు వచ్చాయి. అటు జీవన్ రెడ్డి తన మద్దతు దారులతో వరస సమావేశాలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ సమయంలోనే టీపీసీసీ చీఫ్ నేరుగా జీవన్ రెడ్డితో మంతనాలు చేసారు. పార్టీ వీడవద్దని సూచించారు. భవిష్యత్ పైన హామీ ఇచ్చారు. కాగా, జీవన్ రెడ్డి మాత్రం తన వైఖరి ఏంటో తేల్చి చెప్పారు.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడే వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ఇప్పటికే జీవన్ రెడ్డి స్పష్టం చేసారు. కాగా, కాంగ్రెస్ నేతలు వరుసగా జీవన్ రెడ్డి తో మంతనాలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆహ్వానం అందుకున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలని డిసైడ్ అయ్యారు. అందుకు ముహూర్తం ఖరారు చేసారు. కాగా, తాను కాంగ్రెస్ పార్టీని వీడడం ఖాయమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఎదుట మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి కుండ బద్ధలు కొట్టినట్లు సమాచారం. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమావేశమయ్యారు. జీవన్ రెడ్డితో వారు జరిపిన మంతనాలు విఫలమయ్యాయి. పార్టీ అధిష్ఠానం బుజ్జగింపులను జీవన్ రెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.

రేపు కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా
పార్టీకి రాజీనామా చేసే నిర్ణయానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా వారికి జీవన్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే బుధవారం జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జీవన్ రెడ్డి సన్నాహలు చేస్తున్నారు. దాదాపు 5 వేల మంది కార్యకర్తలతో ఆయన ఈ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సభా వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న వరుస అవమానాలను.. జీవన్ రెడ్డి ఇప్పటికే వివిధ వేదికల ద్వారా బహిరంగంగా వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీని వీడడాలని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తథ్యమని పార్టీ ప్రతినిధులకు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే జీవన్ రెడ్డికి స్పష్టమై హామీ వచ్చినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications