Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాంధీభవన్ జోలికొస్తే తెలంగాణా భవన్ ను పేల్చేస్తాం: రేవంత్ రెడ్డికి మద్దతుగా హస్తంనేతల సంచలనం!!

తెలంగాణ రాష్ట్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి పై తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ గా తలసాని శ్రీనివాస్ యాదవ్ దున్నపోతులను కాసే వాడిని, పేడ పిసుక్కునే వాడని వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ చేసిన వ్యాఖ్యలు యాదవులను అవమానించినట్లే ఉన్నాయని కుల రాజకీయాలకు తెర తీశారు.

రేవంత్ రెడ్డి తక్షణం క్షమాపణ చెప్పాలని లేదంటే, దున్నపోతులతో, గొర్రె పొట్టేళ్ళ తో గాంధీ భవన్ ను ముట్టడిస్తామని గొల్ల కురుమల పోరాట సమితి హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కి మద్దతుగా టీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.

Tpcc leaders supported Revanth Reddy and gave serious warning to brs

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు తప్ప యాదవుల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని, ఆయనను పిసికేస్తానని కామెంట్లు చేశారని మండిపడ్డారు. గాంధీభవన్ ను ముట్టడిస్తామని వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసి, గాంధీ భవన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడుతున్నారని, అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని టీపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లురవి పేర్కొన్నారు. బిఆర్ఎస్ పేరుతో ఆ నాయకులు చేస్తున్నది పొలిటికల్ టూరిజమేనా అంటూ ప్రశ్నించారు . రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమన్నారు.

తల పొగరుతో తలసాని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తే యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలకు తెరలేపారు అని టిపిసిసి ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ మండిపడ్డారు. గాంధీ భవన్ జోలికొస్తే తెలంగాణా భవన్ ను పేల్చేస్తామని అద్దంకి దయాకర్ అన్నారు. అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఇక నుంచి తలసానిని తలమాసిన శ్రీనివాస్ యాదవ్ అని పిలుస్తామని వారు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+