T-Congress జాబ్ క్యాలెండర్ ప్రకటన - ఏ రోజు ఏ నోటిఫికేషన్..!!

తెలంగాణలో కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వంపై నిరుద్యోగుల అసంతృప్తిని ఓట్లుగా మలచుకొనేందుకు మరో అడుగు ముందుకేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, గ్రూప్-1, గ్రూప్-2 సహా కమిషన్ నిర్వహించిన అనేక పరీక్షల్లో అవకతవకలు, వరుస వాయిదాల నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరి కోసం తాము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఏవిధంగా అమలు చేస్తామో కాంగ్రెస్ తేదీలతో సహా ప్రకటించింది.

కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ : ఇప్పటికే తమ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా నెలకొనటంతో ఏ ఒక్క అవకాశం వదులుకోవటం లేదు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది. ఇక, కాంగ్రెస్ గ్రూపు పరీక్షలతో పాటుగా 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. గ్రూప్ -1 నోటిఫికేషన్ ఒక్కసారి విడుదల చేస్తామని, గ్రూప్ 2, 3, 4 నోటిఫికేషన్లు మాత్రం రెండు విడతలుగా విడుదల చేస్తామని వెల్లడించింది.

TPCC released a job calendar specifying the dates on which it would issue notifications for filling vacancies

వరుస నోటిఫికేషన్లతో : తాము అమలు చేసే జాబ్ క్యాలెండర్ పైన యువతకు స్పష్టత కోసం తేదీలు ప్రకటించింది. గ్రూప్స్ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు విడుదల చేసే తేదీలు, కానిస్టేబుల్ పరీక్షల నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన, డిసెంబర్ 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ జాబ్‌ల నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొంది. గ్రూపు-1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని వెల్లడించింది. గ్రూపు-2 ఉద్యోగాల నోటిఫికేషన్‌ 2024 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గ్రూపు-3 నోటిఫికేషన్ జూన్1, డిసెంబరు 1న రెండు విడతలగా విడుదల చేస్తామని నేతలు చెబుతున్నారు. గ్రూపు-4 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1న రెండు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించింది.

తేదీలతో సహా ప్రకటన : వీటితో పాటుగా ఉపాధ్యాయులు..జూనియర్ లెక్చరర్లు, వైద్య- ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ పైన షెడ్యూల్ ను ప్రకటించింది. యూనిఫాం సిబ్బంది పోస్టుల భర్తీకి రెండు ఫేజుల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే మొత్తం రెండు లక్షల భర్తీకి వీలుగా ఈ షెడ్యూల్ ముసాయిదాను సిద్దం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇది అమలు చేసి తీరుతామని హామీ ఇస్తోంది. దీంతో, తేదీలతో సహా కాంగ్రెస్ నిరుద్యోగ యువతలో భరోసా ఇచ్చేలా విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+