వాహనదారులకు బిగ్ షాక్.. అలా చేస్తే క్రిమినల్ కేసులు!

ప్రజలు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంతగా చెప్పినా ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులు ఎంతోమంది ఉంటున్నారు. అత్యంత కఠినంగా ట్రాఫిక్ చలాన్ లను వేసి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపైన అవగాహన కలిగించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా చేస్తే వాహనదారులపై కేసులు

వాహనాలు నడిపే వాహనదారులు అన్ని పత్రాలను కలిగి నిబంధన ప్రకారం వాహనాలను నడపాలని, అలా నడిపితే ఎటువంటి కేసులు నమోదు కావని పోలీసులు పదేపదే చెబుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటున్న క్రమంలో నిబంధనలు పాటించని వారిపై కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించకుండా నెంబర్ లేకుండా తిరిగితే కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

traffic police joint commissioner gave warning criminal cases on those who tampering number plates

వారిపై క్రిమినల్ కేసులు

ట్రాఫిక్ నిబంధనలను పాటించని వారిపైన మోటార్ వాహన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో నంబర్ ప్లేట్లను టాంపరింగ్ చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరికలు జారీ చేశారు. నంబర్ ప్లేట్లను మార్చడం లేదా ట్యాంపరింగ్ కు పాల్పడడం చాలా తీవ్రమైన నేరమని ఇటువంటి వారిపైన క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన వ్యక్తిపై కేసు

నంబర్ ప్లేట్స్ మార్చి ఇతర వాహనదారుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక వ్యక్తిని చాదర్ ఘాట్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు పేర్కొన్న ఆయన, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. మలక్ పేట కు చెందిన సయ్యద్ అలీ ఉద్దీన్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనం అసలు నెంబర్ ప్లేట్ కు బదులుగా, వేరే నెంబర్ ప్లేట్ మీద తిరుగుతున్నాడని గుర్తించారు.

ట్యాంపరింగ్ చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు

టీఎస్ 11 ఈ జెడ్ 2936 కు బదులుగా టీఎస్ 11 ఈజెడ్ 2836 నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతున్నాడన్నారు. ఇతని కారణంగా అసలైన వాహన యజమాని ఫహీమ్ అలీ తన వాహనం పైన వరుసగా ట్రాఫిక్ ఈ చలాన్ లను చూస్తున్నాడని తెలిపారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ మోసం వెలుగులోకి వచ్చిందని ఇలా ఎవరైనా సరే ట్యాంపరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ హెచ్చరించారు.

వాహన యజమానిపై 23 తప్పుడు చలాన్లు

నెంబర్ ప్లేట్ టాంపరింగ్ చేసి అతడు చేసిన పని వల్ల, ట్యాంపరింగ్ కు గురైన నంబరు ఉన్న వాహన యజమానిపై 23 తప్పుడు చలాన్లు నమోదు అయ్యాయని తెలిపారు. ట్యాంపరింగ్ కు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.ట్యాంపరింగ్ కేసులను టెక్నాలజీని ఉపయోగించి సులభంగా గుర్తిస్తున్నాం అని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+