గురుకులాల్లో టీజీటీ సహా పలు పోస్టులకు పరీక్ష హాల్ టికెట్లు విడుదల: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9210 ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 1 నుంచి 23 మధ్య పలు తేదీల్లో జరిగే టీజీటీ, లైబ్రేరియన్, పీడీ ఇన్ స్కూల్స్ తోపాటు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి.
అభ్యర్థులు తమ వివరాలతో బోర్డ్ వెబ్ సైట్ https://treirb.aptonline.in/UI/LoginPages/Login.aspx లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా లాగిన్ అయి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగితా పోస్టులకు సంబందించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.కాగా, ఈ పరీక్షల షెడ్యూల్‌లో గురుకుల నియామక బోర్డ్ స్వల్ప మార్పులు చేసింది. కొన్ని విడతల్లోని సబ్జెక్టులను ఇతర విడతలకు బదిలీ చేసింది.

మొదట ఆగస్టు 1 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా, ఆగస్టు 23 వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డ్ తెలిపింది. కాగా, గురుకులాల్లో మొత్తం 9210 పోస్టులకు గురుకుల నియామక బోర్డ్ 9 నోటిఫికేషన్లు విడివిడిగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.63 లక్షల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. అంటే, ఒక్కో పోస్టుకు సగటున 29 మంది చొప్పున పోటీ పడుతున్నారు.
పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా ప్రతిరోజూ మూడు షిప్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి షిప్టులో ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు, రెండో షిప్టు పరీక్ష మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు, మూడో షిప్టు పరీక్ష సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications