టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే..! త్వరలో పూర్వ వైభవం ఖాయమన్న ఉత్తమ్..!!

telangana,lok sabha elections,results,uttam, tpcc,trs,kcr,ktr,congress party,3lok sabha seats,won.తెలంగాణ, లోక్ సభ ఎన్నికలు, ఫలితాలు, టీపిసిసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, కాంగ్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సహంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా మూడు సీట్లు కైవసం చేసుకుని పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ చరిత్రను అదికార పార్టీ నేతల తక్కువ అంచనాలు వేశారని టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో మిగిలిన పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉందన్నారు. ఆరు సీట్లను గెలవాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల మూడు సీట్లు గెలిచామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో డైనమిక్ లీడర్స్ గెలిచారని అభినందించారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ కి నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ని ఎప్పటికైనా గద్దె దించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. బీజేపీ కి పోటీలో నిలబడే స్థాయి లేకున్నా అదృష్టం కొద్దీ నాలుగు సీట్లలో గెలిచిందన్నారు. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఉత్తమ్ పేర్కొన్నారు.

TRS is a substitute for Congress party.!And soon the former glory is back says uttam.. !!

ఇదిలా ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వంద సీట్లలో డిపాజిట్ రాలేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్థానికంగా బీజేపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయాల్లో అహంకారం పనికి రాదని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు అందుకే లోకసభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. తనకు అదిష్టానం ఏ బాధ్యత కట్టబెడితదే అది నిర్వర్తించడానికి సిద్దంగా ఉన్నానని ఉత్తమ్ తెలిపారు.

అసలు బాధ్యతలు కల్పించకున్న లేకున్నా పార్టీ కోసం చిత్తశుద్దితో పని చేస్తామని చెప్పుకొచ్చారు. పీసీసీ మార్పు పై ఇప్పటి వరకు చర్చ జరగలేదని స్పష్టం చేశారు. నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్లను కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని తెలిపారు. టీఆర్ఎస్ ఒకప్పుడున్న పటిష్ట పరిస్ధితి ఇప్పుడు లేదని పూర్తిగా మారిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+