వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి చివరి ఆశలు ఆక్కడే - టీఆర్ఎస్ ఆశించినదానికి భిన్నంగా..!!

|
Google Oneindia TeluguNews

మునుగోడు హోరా హోరీ పోరులో క్రమేణా టీఆర్ఎస్ ఆధిక్యత పెరుగుతోంది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లు కౌంటింగ్ ముగిసింది. టీఆర్ఎస్ 2,555 ఓట్ల మెజార్టీతో ఉంది. ఆరో రౌండ్ వరకు అందిన సమాచారం మేరకు మొత్తంగా టీఆర్ఎస్ కు 38521 ఓట్లు రాగా, బీజేపీకి 36,356 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు 12,025 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకర్ రెడ్డి 2,169 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ప్రతీ రౌండ్ లోనూ బీజేపీ వర్సస్ టీఆర్ఎస్ అన్నట్లుగా ఓట్లు దక్కించుకోవటంలోనూ పోటీ పడ్డారు. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతోంది.

చౌటుప్పల్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగిన రెండు, మూడు రౌండ్లలో బీజేపీ లీడ్ లో నిలిచింది. ఆ తరువా చౌటుప్పల్ లో తాము ఊహించిన విధంగా మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ ఒక విధంగా నిరాశకు గురయ్యారు. ఏడో రౌండ్ మునుగోడు పట్టణ, గ్రామీణ ప్రాంతానికి చెందినవి, మరో రెండు రౌండ్లు ఇదే ప్రాంతానికి చెందిన ఓట్లు లెక్కించాల్సి ఉంది. ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగా కాంగ్రెస్ - రాజగోపాల్ మధ్య ఓట్ల చీలక వచ్చినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ తన ఓటు బ్యాంకు నిలబెట్టుకుంది.

TRS lead by 2,555 Votes after Seventh round counting in Munugode by poll

మునుగోడు ప్రాంతంలో లో తమకు ఎక్కువ మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ తొలి నుంచి లెక్కలు కట్టింది. ఏడవ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7189 ఓట్లు రాగా, బీజేపీకి 6803 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 386 ఓట్ల మెజార్టీ దక్కింది.6,7,8 రౌండ్లు మునుగోడు మండల కేంద్రం పరిధిలోని పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. అయితే, ఆరు..ఏడో రౌండ్ ఓట్లు పరిశీలిస్తే టీఆర్ఎస్ ఆశించిన మెజార్టీ మునుగోడు మండల కేంద్రంలో దక్కించులేక పోయింది. ఆరో రౌండ్ లో 638 ఓట్లు, ఏడో రౌండ్ లో 386 ఓట్లు మాత్రమే ఆధిక్యత లభించింది.

దీని ద్వారా తొలి రౌండ్ మినహా.. రెండు పార్టీల మధ్య ఏ రౌండ్ లోనూ వెయ్యి దాటి మెజార్టీ రాలేదు. ఇక..ఇప్పుడు బీజేపీ చండూరు మున్సిపాల్టీ పైన ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు పోలింగ్ జరగనున్న 8,9 రౌండ్లు ఆ ప్రాంతానికి చెందినవి కౌంటింగ్ చేయనున్నారు. దీంతో..ఈ రెండు రౌండ్లలో బీజేపీ పుంజుకుంటుందా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక్కడ బీజేపీ మెజార్టీ సాధించకుంటే, టీఆర్ఎస్ ఆధిక్యత చివరి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

English summary
AFter Seventh Round TRS is in lead in Munugode by poll counting, BJP Still hope on win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X