కేసీఆర్ జన్మదినం- పార్టీ శ్రేణుల సంబురాలు : కవిత-కేటీఆర్ స్పెషల్ గా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి...టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు...కేసీఆర్ అభిమానులు అర్ద్రరాత్రి నుంచే వేడుకలు ప్రారంభించారు. ఈ సారి కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 15వ తేదీ నుంచే పార్టీ నేతలు.. మంత్రులు సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అన్నదానం, రక్తదానం, మొక్కలు నాటడం వంటి.. సామాజిక కార్యక్రమాల్లో నేతలు పాల్గొంటున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దివ్యాంగులకు కేటీఆర్ మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేయనున్నారు.
కేటీఆర్ ట్వీట్ వైరల్
కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. అసాధ్యాన్ని సాధ్యమయ్యే కళగా మార్చుకున్న వ్యక్తికి, దయతో నిండిన హృదయంతో నడిపించే వ్యక్తికి, ధైర్యానికి నిర్వచనంగా చెప్పుకొనే వ్యక్తి అయిన నా నాయకుడు.. నా తండ్రి గా గర్వంగా చెప్పుకొనే వ్యక్తి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కుమార్తె..ఎమ్మెల్సీ కవిత ముఖ్యమంత్రి జన్మదినం కావటంతో కేక్ కట్ చేసారు. కేసీఆర్ కప్ వాలీబాల్ పోటీలు నిర్వహించిన తెలంగాణ జాగృతి.. బహుమతులు ప్రదానం చేసింది. రాత్రి 12 గంటలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత కేక్ కోశారు.

మెట్ల మార్గంలో తిరుమలకు కవిత
కవిత మధ్యాహ్నం తిరుమలలో మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారికి పూజలు చేయనున్నారు. తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో కేక్ కోశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో ప్రత్యేక గీతం రూపొందించారు.
Recommended Video
బర్త్ డే స్పెషల్ సాంగ్
ఆ గీతాన్ని బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో గులాబీ రంగులో వేసిన దోశలు ఆకట్టుకున్నాయి. రూపాయికే దోశ ఇవ్వటంతో పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. కరీంనగర్లో కేసీఆర్ సైకత శిల్పాన్ని రూపొందించారు. మంత్రులు..పార్టీ నేతలు పలువురు రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. మరి కొందరు రక్తదానం చేసారు. తెలంగాణ ఎన్నారైలు సైతం కేసీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications