భూపాలపల్లిలో టిఆర్ఎస్ కు షాక్

భూపాలపల్లి :కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ కు ఎదరుదెబ్బ తగిలింది. జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తోన్న టిఆర్ఎస్ కు స్వంత పార్టీ నాయకుల నుండే ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రత్యర్థికి అవకాశం కల్పించేలా స్వంత పార్టీ కి చెందిన ప్రజా ప్రతినిధులు వ్యవహారించడంతో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది.

జయశంకర్ జిల్లా మహాముత్తారం ఎంపిపి ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది.. స్వంత పార్టీ ఎంపిటిసి లే ఆ పార్టీకి చేయిచ్చారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఎంపిపిగా విజయం సాధించారు.

trs shocked in muttaram elections

టిఆర్ఎస్ నుండి విజయం సాధించిన ఇద్దరు ఎంపి టి సి సభ్యులు కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థికి సహాకరించారు.శనివారం నాడు ఎంపిపి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి విజయం సాధించారు. ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తూ విపక్షాలకు చుక్కలు చూపిస్తున్నా అధికార పార్టికి ఆ పార్టీకి చెందిన ఎంపిటిసి సబ్యులే చుక్కలు చూపించారు.

టిఆర్ఎస్ నుండి ఎంపిపి అభ్యర్థిగా మార్క రాముగౌడ్, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా వెంకటస్వామి బరిలో నిలిచారు. 8 మంది ఎంపిటిసిలకు గాను ఇద్దరు ఎంపిటిసిలు గైరాజరయ్యారు.మరో ఇద్దరు టిఆర్ఎస్ ఎంపిటిసి సభ్యులైన కవిత, జ్యోతి లు కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థఇ వెంకటస్వామికి మద్దతు తెలిపారు. దీంతో టిఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వెంకటస్వామి విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+