వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల నోరు అదుపులో పెట్టుకో.. బీజేపీయే తెలంగాణ ద్రోహీ : వినోద్ కుమార్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న ద్రోహీ బీజేపీయేనని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కూమార్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం చేశారని విమర్శించారు. వారి వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని దుయ్యబటారు . రాష్ట్రంలో కొత్తగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహయం చేయడంలేదని మండిపడ్డారు.

విద్యాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట

విద్యాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట


హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ , ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ మేనేజ్మెంట్ , నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు, వంటి పలు విద్యా సంస్థలను మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణకు తీరని అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. దీనిపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కనీసం నోరుమెదపడంలేదని విమర్శించారు. తెలంగాణలో విద్యాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని మండిపడ్డారు.

బీజేపీ ఎంపీలతో ఎలాంటి ప్రయోజనం లేదు..

బీజేపీ ఎంపీలతో ఎలాంటి ప్రయోజనం లేదు..


తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదనన్నారు వినోద్ కుమార్. కనీసం బీజేపీ ఎంపీలు సొంతంగానైనా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి ఇకనైనా ఎంపీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది.. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు

రైతులకు బీమా కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. . 60 ఏండ్లు దాటిన వారు రైతు కాదా?..రైతు బీమా ప‌రిమితిని 59 ఏండ్లుగా ఎలా నిర్ణయిస్తారు అని ప్రశ్నించారు. దీనిపై వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాదవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల్లో అమలవుతున్న ఇన్సూరెన్స్, ఇతర పథకాల్లలో 60 ఏళ్లు లోపు ఉన్నవారికే వర్తిస్తున్నాయని పేర్కొన్నారు. షర్మిల ఇది మీకు తెలియదా? అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది. వీటిని మెచ్చకోవాల్సింది పోయి .. విమర్శలు చేయడం సరికాదని వినోద్ కుమార్ హెచ్చరించారు.

English summary
TRS Vinod kumar warning to YS Sharmila, BJP Leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X