గూగుల్ మ్యాప్స్ ను నమ్మి.. కృష్ణా నదిలోకి లారీ..!
ఒక తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం సాధారణంగా గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేస్తుంటాం. ఆ యాప్ చూపించిన రూట్ ప్రకారం వెళ్తుంటాం. చాలాసార్లు ఈ రూట్ సరిగానే చూపించినప్పటికీ ఒక్కోసారి అది బెడిసికొట్టిన సందర్భాలూ ఉన్నాయి. సరైన రోడ్డుమార్గాన్ని గుర్తించడంలో గూగుల్ మ్యాప్స్ కూడా బోల్తా పడతాయని ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. అయితే తాజాగా ఓ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం లారీని నడుపుకుంటూ వెళ్లి కృష్ణా నది ఒడ్డుకు వెళ్లిపోయాడు. తన ఎదురుగా రోడ్డుకు బదులుగా నది ఉండటాన్ని చూసి అవాక్కయ్యాడు.
తెలంగాణలోని వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం లారీని నడుపుకుంటూ వెళ్తే ఆ లారీ కృష్ణా నది ముందుకు వెళ్లింది. ఆ లారీ ఏపీలోని బేతం చెర్ల నుంచి బండల లోడుతో తెలంగాణలోని మక్తల్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే లారీ డ్రైవర్ జాతీయ రహదారి 44 మీదుగా కొత్తకోట వరకు బాగానే వచ్చాడు. ఆ తర్వాత ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో ఆయనకు గూగుల్ మ్యాప్స్ గుర్తుకువచ్చింది. వెంటనే మొబైల్ లో యాప్ ఓపెన్ చేసి ఆత్మకూర్ నుంచి మక్తల్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అలా గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆత్మకూర్ చౌరస్తా వెళ్లేసరికి తెల్లవారుజాము అయింది. అయితే చౌరస్తా వద్ద టర్నింగ్ తీసుకోవాల్సి ఉండగా.. గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఆ డ్రైవర్ అలాగే ముందుకు సాగాడు. అలా జూరాల గ్రామానికి వెళ్లాడు. అలానే ముందుకు వెళ్తుండగా కొంత దూరంలో నీళ్లు కనిపించాయి. రోడ్డు మాయం అయింది. దీంతో లారీ డ్రైవర్ కు అనుమానం వచ్చింది. లారీ దిగి చూసి షాక్ తిన్నాడు. అలాగే కొద్దిదూరం వెళ్తే .. కృష్ణానదిలోకి లారీ వెళ్లిపోయి ఉండేది. అప్పటికే లారీ నది తీరంలోని ఘాట్‌లోకి వెళ్లిపోయింది.

లారీని ముందుకు వెళ్లకుండా టైర్ల కింద రాళ్లు పెట్టి.. సమీప గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా.. వారి సాయంతో లారీ ఓనర్ కు ఈ విషయం తెలిసింది. దాంతో మరో లారీలో బండలను ఎక్కించారు. ఘాట్ పైన ఉన్న లారీని జేసీబీ సాయంతో వెనక్కు లాగి రోడ్డు పైకి ఎక్కించి తిరిగి పంపించేశారు.
-
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications