రేవంత్ ఛాయిస్ ఎవరు - హరీష్ కు ఛాన్స్ దక్కేనా..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అసెంబ్లీ కొలువు తీరనుంది. ఇప్పటికే తొలి మంత్రివర్గం భేటీ అయింది. ఇక..కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటుగా స్పీకర్ ఎన్నిక కోసం రేపు (శనివారం) కొత్త అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసారు. ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించే ప్రొటెం స్పీకర్ ఎవరు. సీఎం రేవంత్ ఛాయిస్ ఏంటి. సీనియర్లుగా ఉన్న బీఆర్ఎస్ నేతలకు అవకాశం దక్కుతుందా. ఏం జరుగుతోంది.

ప్రత్యేక అసెంబ్లీ సమావేవం: ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగనుంది. అదే రోజున ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. స్పీకర్ ఎన్నిక వుంటుంది. ముందుగా ప్రొటెం స్పీకర్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తరువాత ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు.

TS Assembly Session on 9th Dec: MLAs Oath taking to be followed by election of Speaker

ముందుగా సీఎం, ప్రతిపక్ష నేత..వరుసగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ వెంటనే స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుంది. అదే రోజు లేదా సోమవారం కొత్త స్పీకర్ బాధ్యతల స్వీకరణ ఉండేలా ఆలోచన చేస్తున్నారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇప్పటికే ఖరారు చేసారు. ఇక.. ప్రొటెం స్పీకర్ ఎవరనేది తేలాల్సి ఉంది.

ప్రొటెం స్పీకర్ ఎవరు: సాధారణంగా అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉంటారు. ప్రస్తుతం మాజీ సీఎం కేసీఆర్ సభలో అందరి కంటే సీనియర్. కానీ, ఆయన ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం లేదు. తాజాగా ఆస్పత్రిలో చేరటంతో రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగానే ఉండనున్నారు. ఆ తరువాత మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి హరీష్ సీనియర్లుగా ఉన్నారు.

మంత్రులు తుమ్మల, ఉత్తమ్, ఎంఐఎం నేత అక్బర్, తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్ సైతం ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కానీ, మంత్రులుగా ఉన్న తుమ్మల..ఉత్తమ్ కు ప్రొటెం స్పీకర్ గా ఛాన్స్ ఉండదు. దీంతో.. హరీష్.. పోచారం లో ఒకరు ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ సీఎం రేవంత్ నిర్ణయం కీలకం కానుంది.

ప్రతిపక్ష నేత ఎవరికి ఛాన్స్: హరీష్, పోచారంలో ఒకరిని ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇస్తారా లేక..కాంగ్రెస్ లోని సీనియర్ నేతకే అవకావం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. 2014 లో బీఆర్ఎస్ గెలిచిన సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, 2018 లో ఎంఐఎం నేత ముంతాజ్ ఖాన్ ప్రొటెం స్పీకర్లుగా వ్యవహరించారు.

ఇక..ఇప్పుడు రేవంత్ ఛాయిస్ ఎవరనేది ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ నేతలకు అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి. ఇక...స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ ఎన్నిక రేపే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి శాసన సభా పక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+