Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కౌంటింగ్ రోజు గ్రహ స్థితి కలిసొచ్చేదెవరికి - ఈ నక్షత్రాల వారికి గెలుపు ఖాయం..!!

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పోటీలో ఉన్న అభ్యర్దుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ప్రధాన పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నా..లోలోపల మాత్రం టెన్షన్ తప్పటం లేదు. దీంతో..ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్దులు జ్యోతిష్యులు, న్యూమరాలజిస్టులను సంప్రదిస్తున్నారు. కౌంటింగ్ రోజున ఉన్న ముహూర్తం..తిధి..నక్షత్రం..అభ్యర్దుల జాతకం ప్రకారంతో పోల్చి చూసి గెలుపు పైన అంచనాలు వెల్లడిస్తున్నారు.

అభ్యర్దుల్లో ఉత్కంఠ: రేపు (ఆదివారం) తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సమయంలోనే పలువురు అభ్యర్దులు జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రం పైన నమ్మకం పెట్టుకుంటున్నారు. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించిన అభ్యర్దులు..ఇప్పుడు ఇక వారి తీర్పు ఈవీఎంలల్లో నిక్షిప్తం కావటంతో గ్రహా స్థితి కలిసి వస్తుందా లేదా అనేది తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

TS Contesting Candidates Approaches Numerologists and Astrologist for Result predictions

కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కార్తీక మాసం షష్ఠి తిథి కావటంతో నక్షత్రం..కౌంటింగ్ వేళ ఉన్న గ్రహాల స్థితుల గురించి ఆరా తీస్తున్నారు. ఉదయం 9.08 నుంచి 10.55 వరకు వర్జ్యం ఉన్నట్లుగా పంచాంగాలు స్పష్టం చేస్తున్నాయి.

ముహూర్తం- గ్రహ స్థితి: సాయంత్రం 4.13 నుంచి సాయంత్రం 5.36 వరకు రాహుకాలం. మధ్నాహ్నం 12.05 నుంచి 01.28 వరకు యమగండంగా పండితులు చెబుతున్నారు. ఉదయం 07.49 నుంచి 3.36 వరకు అమృత కాలంగా స్పష్టం చేసారు. ఉదయం 11.02 నుంచి మధ్నాహ్నం 01.31 వరకు, అదే విధంగా సాయంత్రం 04.08 నుంచి రాత్రి 04.52 వరకు, రాత్రి 07.15 నుంచి 8 గంటల వరకు దుర్ముహుర్తాలుగా వెల్లడించారు.

ఇక, సంఖ్యా శాస్త్రం ప్రకారం సాధారణంగా షష్టి తిధి రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. డిసెంబర 3న ఏ నక్షత్ర జాతకులకు కలిసి వస్తుందనేది విశ్లేషిస్తున్నారు. దీంతో..పార్టీలకు నాయకత్వం వహిస్తున్న ముఖ్య నేతలు..అభ్యర్దులు తమ జాతకాలు...నక్షత్రాలను పరిశీలించుకుంటున్నారు.

కలిసొచ్చే నక్షత్రాలు: పండితులు చెబుతున్న లెక్కల ప్రకారం రేపు (డిసెంబర్ 3)న అశ్వని, కృత్తికా, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనూరాధా, మూలా, ఉత్తరాషాడా, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుందని సంఖ్యా నిపుణులు చెబుతున్నారు.

రాజకీయంగా భవిష్యత్ ను నిర్దేశించే రోజు కావటంతో పోటీలో ఉన్న అభ్యర్దులు తాము నమ్మే సిద్దాంతుల వద్ద రేపటి రోజున కలిసొచ్చే అంశాల పైన ఆరా తీస్తున్నారు. అదే విధంగా పార్టీల పరంగానూ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరికి కలిసొస్తుందనేది చర్చగా మారింది. కానీ, అసలు విజేత ఎవరనేది మాత్రం రేపు కౌటింగ్ లోనే స్పష్టత రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+