TS EAMCET 2020: ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..? వారికి మళ్లీ ప్రత్యేకంగా పరీక్ష..!

కాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.మధ్యాహ్నం 3 గంటలకు ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాఖాఖ మండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష1.43 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదిలా ఉంటే పరీక్షకు దరఖాస్తు చేసుకుని కరోనావైరస్ సోకి పరీక్షకు హాజరుకాలేకపోయిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా మరోసారి పరీక్ష నిర్వహిస్తుంది. ఆగష్టు 17 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కరోనా వైరస్ సోకి పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక ఆన్‌లైన్‌లో ఫలితాలను పొందుపర్చనున్నట్లు పాపిరెడ్డి చెప్పారు. ఇందుకోసం పరీక్ష రాసిన విద్యార్థులు TSCHE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అక్కడి నుంచి ఫలితాలను పొందొచ్చని స్పష్టం చేశారు పాపిరెడ్డి.

TS EAMCET 2020 : Result to be declared today , Here is how you need to check the rank

పరీక్ష ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి:
ముందుగా TSEAMCET 2020 అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి

TSEAMCET 2020 నోటిఫికేషన్ పై క్లిక్ చేయండి, నేరుగా రిజల్ట్ లాగిన్ పేజ్‌కు తీసుకెళుతుంది. అయితే ఇది ఫలితాలను ప్రకటించిన తర్వాత మాత్రమే యాక్టివ్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి

ఇక విద్యార్థి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన రోజులను ఎంటర్ చేయాల్సి ఉంటుంది

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే రిజల్ట్ ప్రత్యక్షం అవుతుంది. ఆపై భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై కావాలంటే కనీసం 25శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. అయితే ఫైనల్ ర్యాంక్ మాత్రం 75శాతం+25శాతం మార్కులను పరిగణలోకి తీసుకుని ఇస్తారు. అంటే 75శాతం మార్కులు ఎంసెట్‌ పరీక్షకు కేటాయిస్తుండగా 25శాతం మార్కులు ఇంటర్మీడియట్ పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+