Group-1: టీఎస్‍పీఎస్సీ వెబ్ సైట్‍లో గ్రూప్-1 ప్రిలిమినరీ హల్ టికెట్లు..
టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి హాల్ టికెట్లను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ ఐడీ, డేటాఫ్ బర్త్ తో tspsc.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కమిషన్ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. ఓఎంఆర్ షీట్లో ఇది వరకు బుక్లెట్ సిరీస్ ఏ, బీ, సీ, డీ గా ఉండేదని, దాన్ని నంబర్లలోకి మార్చామని పేర్కొన్నారు.
3,80,202 మంది దరఖాస్తు
అయితే హాల్ టికెట్లను వెబ్ సైట్‍లో పెట్టిన రెండు గంటల్లోనే 70 వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 503 గ్రూప్ 1 పోస్టుల కోసం 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 33 జిల్లాల్లో 1,041 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఎలాంటి అటంకాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.

ఉదయం 10.30
ఆదివారం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపింది. మరోపక్క గ్రూప్1 పరీక్ష నిర్వహణ, సెంటర్లలో సౌకర్యాలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కలెక్టర్లతో పలుమార్లు సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతి సెంటర్లో సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేశారు.పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానికి పరికాలు అంటే మొబైల్స్, స్మార్ట్ వాచీలు లాంటి అనుమతించారు.












Click it and Unblock the Notifications