టీఎస్ఆర్టీసీ టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్

హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు 'టి-9 టికెట్‌' తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది.

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది.

TSRTC extend timings of t9 ticket for rural and town women and senior citizen passengers

టీ9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్‌ వర్తిస్తుంది. టీ9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం టి-9 టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌తో రూ.100 చెల్లించి 60 కి.మీ పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయవచ్చు. జూన్‌ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారని తెలిపింది.

టి-9 టికెట్‌ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆర్‌టీసీ సంస్థను ఆదరించాలి'' అంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+