టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్: ఇకపై వారంతా డీలక్స్ బస్సులోనూ ప్రయాణించొచ్చు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పలు కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. తాజాగా, టీఎస్ఆర్టీసీ మరో బంపరాఫర్ ప్రకటించింది. ఇది ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ తీసుకునే వారికి తీపికబురు అందించింది.
ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి వీసీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రతీసారి ఏదొక సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా, ఎంఎస్టీ పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సులోనూ ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ ఆఫర్ ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
అయితే, ఎంఎస్టీ పాస్ ఉన్న ప్రయాణికులు ఈ కాంబినేషన్ టికెట్ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకొని డీలక్స్ బస్సులో ప్రయాణించాలని సజ్జనార్ సూచించారు. ఈ కాంబినేషన్ టికెట్‌తో రాష్ట్రంలో 100 కిలోమీటర్ల పరిధి వరకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అలాగే ఈ ఆఫర్ రాష్ట్రమంతా ఉన్న డీలక్స్ బస్సులకు వర్తిస్తుంది.
ఆర్టీసీ అందిస్తున్న ఈ ఆఫర్ కోసం ఎక్స్‌ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ కావాలనుకునేవారు.. స్థానిక టీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. అయితే, టీఎస్ఆర్టీసీ ప్రకటించిన ఈ సరికొత్త ఆఫర్ సమ్మర్ వరకే ఉంటుందా? లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా? అనే దానిపై ఆర్టీసీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆఫర్ కొనసాగుతోంది.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications