ప్రయాణీకులకు TSRTC గుడ్ న్యూస్, కష్టాలకు చెక్ - ఇక నుంచి..!!
TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకుల టికెట్ల కష్టాలకు చెక్ పెట్టింది. బస్సు పాస్ ల జారీ విధానంలోనూ కొత్త మార్పులు తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రయాణీకులు ఇక కేవలం తమ ఫో్ ద్వారానే అన్ని రకాల ఆర్టీసీ సేవలు పొందే అవకాశం కల్పించింది. వెయిటింగ్ .. క్యూ లైన్ల సమస్య లేకుండానే ప్రయాణీకులకు కావాల్సిన విధంగా సేవలు అందించేందుకు తాజాగా తీసుకున్న నిర్ణయం తో వెసులుబాటు కలగనుంది. నిమిషాల్లోనే ప్రయాణీకులకు ఈ సేవలు అందించేందుకు సిద్దమైంది.
తెలంగాణ ఆర్టీసీ తాజాగా స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా బస్ టికెట్లు.. బస్ పాస్ లు పొందే విధంగా అవకాశం కల్పించింది. ఈ యాప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా ఇంటర్ సిటీ బస్సుల టికెట్లను పొందే అవకాశం కల్పించారు. తెలంగాణ ఆర్టీసీలో ప్రస్తుతం 1,710 బస్సులను ముందస్తుగా ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయ అందుబాటులో ఉంది. వీటి ద్వారా దాదాపు ప్రతీ రోజు 13 వేల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక.. ఈ బస్సుల్లో రిజర్వేషన్ ను యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు కలిగింది. ఈ యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. డిజిటల్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుందని అధికారులు వెల్లడించారు. అదే విధంగా అయిదు కేటగిరీల బస్ పాసులు సైతం ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్స్ ప్రెస్, మెట్రోడీలక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ, ఆర్డినరీ, పుష్పక్ ఏసీ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ అయిదుకేటగిరీల సిటీ బస్ పాస్‌లను డిజిటల్ రూపంలో కొత్తగా ప్రవేశపెట్టింది.

ప్రయాణీకులకు యాప్ ద్వారా అన్ని రకాల సేవలు
బస్ పాసుల రెన్యువల్ చేసుకోవటానికి ఈ యాప్ దోహదం చేస్తుంది. దీని ద్వారా ఇక నుంచి బస్ పాస్ ప్రయాణం సమయంలో దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదు. టీ-24 టికెట్ తీసుకుని హైదరాబాద్ లో ప్రయాణం చేసే వారు ఈ యాప్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. కాగా, తాజాగా తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా బుక్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు రాయితీలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా వస్తాయి. యాప్ లో మొబైల్ నంబర్ తో లాగిన్ అయిన తరువాత.. పాస్ కావాలనుకుంటే టీజీఆర్టీసీ పై క్లిక్ చేయాలి. కావాల్సిన కేటగిరీలను ఎంచుకున్న తరువాత.. వన్డే పాస్ క్లిక్ చేయగానే జెండర్ సెలక్ట్ చేసుకుని అక్కడ అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ ప్లే ద్వారా పేమెంట్ చేస్తే స్కానర్ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణం సమయంలో టికెట్ తో అవసరం లేకుండా.. క్యూ ఆర్ కోడ్ చూపించటం ద్వారా రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేసారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications