ఆర్టీసీ కార్మికులకు ఏబీవీపీ మద్దతు.. ఓయూలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారుతోంది. కార్మిక సంఘాల ఆందోళనలకు వివిధ ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు తోడవుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిందే అంటూ అండగా నిలబడుతున్నారు. కొందరు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మరింత ఎరుపెక్కుతోంది. ఆ క్రమంలో విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తలు కదం తొక్కారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఆర్ట్స్ కళాశాల దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు. కేసీఆర్ నిరంకుశ పాలన మంచిది కాదంటూ హితవు పలికారు.

ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇదంతా కూడా కేసీఆర్ అహంకార ధోరణి వల్లే జరుగుతోందని ధ్వజమెత్తారు ఏబీవీపీ నాయకులు. ఇప్పటికైనా భేషజాలు వీడి ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని సూచించారు. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన సురేందర్ గౌడ్ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నినదించారు. వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. వెంటనే విద్యా సంస్థలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications