హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఆర్టీసీ లేడీస్ స్పెషల్ బస్.. రూట్స్, టైమింగ్స్ ఇవే

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అల్లాడిపోయింది. ప్రత్యేకించి- ఐటీ కారిడార్ మొత్తం అస్తవ్యస్తమైంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ఐటీ ఉద్యోగులు ఇళ్లకు చేరుకోవడం గగనమైంది. కిలోమీటర్ దూరం ప్రయాణం చేయడానికి గంటల సమయం పట్టింది.

ఆఫీస్ నుంచి సాయంత్రం అనగా ఇంటిదారి పట్టిన ఉద్యోగులు అర్ధరాత్రిక్కూడా చేరుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పట్లో. కొండాపూర్, గచ్చీబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి..వంటి ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు మందగించాయి.

 TSRTC

దీని తరువాత సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అధికారులు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఐటీ ఉద్యోగుల లాకౌట్ సమయాన్ని మార్చారు. వేర్వేరు సమయాల్లో వారంతా తమ విధులను ముగించుకునేలా సమయాన్ని సవరించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది. ఐటీ కారిడార్‌లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడట్లేదు.

అదే సమయంలో- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కారిడార్‌లో వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని కొంతమేరకైనా తగ్గించేలా తక్షణ చర్యలు చేపట్టారు. వ్యక్తిగత వాహనాల వినియోగం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందని గుర్తించిన టీఎస్ఆర్టీసీ అధికారులు ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా- ఐటీ కారిడార్‌లో లేడీస్ స్పెషల్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఐటీ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ బస్ సర్వీసును అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మహిళా ఉద్యోగులు సకాలంలో ఇంటికి వెళ్లేలా ఈ ఏర్పాటు చేశారు.

జేఎన్‌టీయూ- వేవ్ రాక్ మధ్య ఈ ఐటీ కారిడార్ లేడీస్ స్పెషల్ బస్సు రాకపోకలు సాగిస్తుంది. ఉదయం 9:05 నిమిషాలకు జేఎన్‌టీయూ వద్ద ఈ బస్సు బయలుదేరుతుంది. మళ్లీ సాయంత్రం 5:50 నిమిషాలకు వేవ్ రాక్ నుంచి జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ బస్సు అందుబాటులోకి రానుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది.

జేఎన్టీయూ నుంచి బయలుదేరే ఈ బస్సు ఫోరమ్/నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్/రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చీబౌలి క్రాస్ రోడ్స్, ఇందిరా నగర్, ఐఐఐటీ క్రాస్ రోడ్స్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+