జూనియర్ లైన్‌మ్యాన్, ఏఈ పరీక్ష హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేస్కోండి: 30న పరీక్ష
హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSSPDCL)లో 1601 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పరీక్షలకు తేదీ దగ్గరపడింది. దీంతో హాల్ టికెట్లు విడుదల చేసింది. సోమవారం నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డెైరెక్ట్ ప్రతిపాదికన 1553 జూనియర్ లైన్ మ్యాన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ 30న పరీక్ష జరగనున్న క్రమంలో హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్ష, నైపుణ్యాల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రిఫరెన్స్ ఐడీ/పేరు/మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జూనియర్ లైన్ మ్యాన్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అసిస్టెంట్ ఇంజినీర్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు 30న
పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం తుది రాత పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, సరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాత పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కమ్యూకేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాత పరీక్ష ఉంటుంది.
కాగా, సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ రెండు పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్ష కేంద్రాన్ని కేటాయించనున్నట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ తెలిపారు. కానిస్టేబుల్ తుది రాత పరీక్ష హాల్ టికెట్లను అభ్యర్థులు ఏప్రిల్ 24న ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications