రేవంత్‌కు ఆదిలోనే షాక్, అనుమతికి నో: ధైర్యవంతుడు, కేసీఆర్-బాబు కలవడం వల్లే: లక్ష్మీపార్వతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కెదురయింది. జలవిహార్‌లో సోమవారం తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

చదవండి: రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

దీంతో, జూబ్లీహిల్స్‌లోని రేవంత్ ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.

చదవండి: ఉండలేను.. వెళ్తావా: భుజంపై బాబు చేయి, రేవంత్ కంటతడి, ఏపీ సీఎంవోలో ఎమోషనల్

మనసులోని మాటను వెల్లడించనున్నారు

మనసులోని మాటను వెల్లడించనున్నారు

రేవంత్ రెడ్డి ఆదివారం కొడంగల్‌లో కార్యకర్తలతో భేటీ అయిన విషయం తెలిసిందే. సోమవారం జలవిహార్‌లో నిర్వహించే సమావేశానికి సీఎం కేసీఆర్ వ్యతిరేక శక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయం తీసుకొని తన మనసులోని మాటను సోమవారం వెల్లడించనున్నారు. కాంగ్రెస్‌లో చేరిక విషయం వెల్లడించనున్నారు.

అందుకే నిరాకరించారా?

అందుకే నిరాకరించారా?

కొడంగల్ సభ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కబంద హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు తాను టీడీపీకి రాజీనామా చేసానని, కేసీఆర్‌ను గద్దె దింపుతానని మండిపడ్డారు. టీఆర్ఎస్ పైన ఆరోపణల నేపథ్ంలో ఆయన జలవిహార్ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారని భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు పెట్టలేదు

రేవంత్ రెడ్డి ఎలాంటి షరతులు పెట్టలేదు

రేవంత్ రెడ్డి అక్టోబర్ 31న కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ కుంతియా ఆదివారం చెప్పారు. రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని కొనియాడారు. ఆయన చేరికపై పార్టీలో వ్యతిరేకత లేదన్నారు. రేవంత్ షరతులు పెట్టి పార్టీలోకి వస్తున్నారా అంటే లేదని కుంతియా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముందస్తు షరతులు ఉండవని చెప్పారు.

పదవులపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు

పదవులపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు

పదవుల వంటి వాటి పైన రేవంత్ రెడ్డికైనా, మరెవరికైనా ఎలాంటి హామీలు ఇవ్వమని, ఇచ్చేది లేదని చెప్పారు. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి కలిగిన వారిని చేర్చుకుంటామన్నారు.

కొడంగల్‌లో టీఆర్ఎస్ సత్తా చాటాలి

కొడంగల్‌లో టీఆర్ఎస్ సత్తా చాటాలి

కాగా, కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ఇవాళ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీ కండువాను కప్పుకున్నారు. మద్దూరు మండలానికి చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో జాయిన్ అయ్యారు. మద్దూరు మండలంలోని ఎదిరిపాడు ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప్పడిగట్టు ఎంపీటీసీ రాములమ్మ, ఈరారం ఎంపీటీసీ వెంకటమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ సుక్కమ్మ, నందిపాడు సర్పంచ్ ముద్దమ్మ, ఎదిరిపాడు మాజీ సర్పంచ్ రాజయ్య, ఇతర నాయకులకు ల‌క్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పార్టీ కండువా కప్పి సాదరంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కొడంగల్‌లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలన్నారు.

రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి ఇలా

రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి ఇలా

టీడీపీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి ధైర్యవంతుడని, చంద్రబాబు కోసం జైలుకు కూడా వెళ్లాడని వైసిపి నేత లక్ష్మీపార్వతి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఒక్కటవడంతో రేవంత్ పార్టీ వీడారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Revanth Reddy, who quit the Telugu Desam Party (TDP) yesterday, is all set to join Congress on October 31 in the presence of AICC vice-president Rahul Gandhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి