అంతు తేలుస్తా అన్నాడు: రమేష్ రాథోడ్ వర్సెస్ రేఖా నాయక్

Posted By:
Subscribe to Oneindia Telugu

నిర్మల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖా నాయక్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వీధికెక్కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుటే తిట్టిపోసుకున్నారు. వివాదం తెలంంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెవిన కూడా పడింది.

తాజా వివాదంతో నిర్మల్‌ జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరినట్లు అర్థమవుతోంది. మంగళవారం ఖానాపూర్‌ లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలోనే రేఖా నాయక్, రమేష్ రాథోడ్ మధ్య వివాదం బయటపడింది.

ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌ వర్గీయులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు, దూషణలకు దిగారు. 10న పోచంపాడ్‌లో జరిగే సీఎం సభకు జనసమీకరణ కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తెరాస గ్రూపు తగాదాలు బయటపడ్డాయి.

నువ్వెంత అంటే నువ్వెంత.

నువ్వెంత అంటే నువ్వెంత.

శాసనసభ్యురాలు రేఖా నాయక్ వర్గీయులు, రమేశ్‌ రాథోడ్‌ వర్గీయులు నువ్వెతంటే నువ్వెంత అనే స్థాయిలో తగాదా పడ్డారు. పరస్పరం పోటీ నినాదాలు చేశారు. ఆశ్చర్యపోవడం ఇంద్రకరణ్ రెడ్డి వంతు అయింది. రాథోడ్‌ రమేశ్‌ ఇటీవలే తెలుగుదేశం నుంచి తెరాసలో చేరారు. కాంగ్రెస్‌ నుంచి పడిపైడి రవీందర్‌ చేరారు. వీరి చేరిక నుంచే తెరాసలో విభేదాలు ప్రారంభమయ్యాయి.

Jogi Ramesh fires on Chandrababu Naidu over water Projects - Oneindia Telugu
కెసిఆర్‌కు సమాచారం

కెసిఆర్‌కు సమాచారం

రమేష్ రాథోడ్, రేఖా నాయక్ వర్గాల మధ్య ఖానాపూర్‌లో జరిగిన గొడవల సమాచారాన్ని ఇంలెలిజెన్స్‌ వర్గాలు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అందించినట్లు సమాచారం. ఖానాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్‌కు వ్యతిరేక వర్గం ఇది వరకే ఉంది. అయితే రమేష్‌ రాథోడ్‌, రవీందర్‌రావులు ఆ పార్టీలో చేరడంతో ఆ విభేదాలు ముదిరి వీధికెక్కాయి.

మంత్రి చెప్పినా....

మంత్రి చెప్పినా....

ఇరు వర్గాలను ఒక తాటి మీదికి తేవడానికి ఏర్పాటు చేసిన సమావేశంలోనే రెండు విడిపోయి గొడవ పడ్డారు. సభావేదికపై ఎమ్మెల్యే రేఖా నాయక్ చేసిన ప్రసంగం కూడా మనస్పర్థలను, ఆధిపత్య పోరును బహిర్గంతం చేసిందంటుని అంటున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. అంతకుముందు స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కూడా కూడా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి.

కుర్చీ విషయంలో...

కుర్చీ విషయంలో...

నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో మంగళవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే రేఖానాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుర్చీ విషయంలో తలెత్తిన సమస్య వారిద్దరి మధ్య వివాదాన్ని సృష్టించింది. బతకడానికి వచ్చావు జాగ్రత, నీ అంతు తేలుస్తా అని రాథోడ్ రమేష్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో రేఖా నాయక్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మహారాష్ట్ర నుండి బతికివచ్చిన కుటుంబం నీది, మహిళలతో మాట్లాడే విధానం ముందు నేర్చుకోవాలని ఆమె విరుచుకుపడ్డారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఎఎంకె ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సమావేశం తర్వాత ఎమ్మెల్యే రేఖానాయక్ తమ అనుచరులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తనపై అనుచితంగా ప్రవర్తించిన రాథోడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేశారు. గతంలో కూడా ఆయన గన్‌మెన్ తనను బలవంతంగా నెట్టివేశాడని అన్నారు. రాథోడ్‌పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె రాథోడ్‌ను అరెస్ట్ చేయాలని లిఖితపూర్వకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The tussle between Khanapur MLA Rekha Naik and ex MP Ramesh Rathode in Nirmal district of Telangana became headache to Telangana Rastra Samithi (TRS) chief and CM K chandrasekhar Rao (KCR).
Please Wait while comments are loading...