నెక్స్ట్ షకీలా: మహిళా ప్రొఫెసర్‌కు టెక్కీతో కలిసి మరో మహిళ వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫసర్‌ను వేధించిన వ్యక్తి, మహిళను రాచకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

కక్ష తీర్చుకునేందుకు మహిళ మరో మహిళపై

కక్ష తీర్చుకునేందుకు మహిళ మరో మహిళపై

ఓ మహిళ మరో మహిళపై కక్ష తీర్చుకునేందుకు ఫేస్‌బుక్ వేదికగా వేధింపుల పర్వానికి దిగింది. బాధిత మహిళ ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి నిందితులు చైతన్య, నినితలను అరెస్టు చేశారు.

 మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్

మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మౌలాలికి చెందిన ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు క్రాంతి కుమార్ ఐడీ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ తర్వాత బాధితురాలి చిత్రాన్ని ఆమెకు పంపించారు.

నెక్స్ట్ షకిలా ఇన్ టీఎఫ్ఐ

నెక్స్ట్ షకిలా ఇన్ టీఎఫ్ఐ

ఆ తర్వాత 'నెక్స్ట్ షకీల ఇన్‌ మన టీఎఫ్‌ఐ(తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ)కి' అంటూ అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారు. బాధితురాలికి సంబంధించిన వారికి ఆ చిత్రాలు, మెసేజ్‌లు వెళ్లాయి.

 బంధువులు చూసి ఫిర్యాదు

బంధువులు చూసి ఫిర్యాదు

బాధితురాలి బంధువులు, స్నేహితులు వీటిని చూసి ఆమెకు చెప్పారు. దీంతో సదరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాఫ్తు జరిపిన పోలీసులు మౌలాలి నుంచి ఫేస్‌బుక్ ఖాతా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

 టెక్కీలుగా గుర్తించారు

టెక్కీలుగా గుర్తించారు

వారు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న టెక్కీలుగా గుర్తించారు. వారి పేర్లు చీర్ల చైతన్య, శ్యామ్ నినిత. వీరే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. చైతన్య భార్య, శ్యామ్ నినితలు కలిసి వ్యాపారం చేస్తున్నారు.

 అందుకే పరువు తీయాలని

అందుకే పరువు తీయాలని

అయితే బాధితురాలితో వ్యక్తిగత కక్ష కారణంగా వీరిద్దరు ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు గుర్తించారు. వారి మధ్య మెయిన్‌టెనెన్స్ విషయమై గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె పరువు పోగొట్టేందుకు ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. వారిని పోలీసులు రిమాండుకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two arrested for harassing assistant professor in Hyderabad on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి