సంధ్య థియేటర్ తొక్కిసలాట: ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చిక్కడపల్లి ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సినీనటుడు అల్లు అర్జున్ తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, బేగంపేట కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ పరిస్థితి నిలకడగా ఉందని ఏసీపీ తెలిపారు. భగవంతుడి దయతో బాలుడు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Two arrested in Sandhya Theater stampede incident

సంధ్య థియేటర్ సంబంధించిన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించామని ఏసీపీ రమేశ్ కుమార్ తెలిపారు. థియేటర్ యాజమాన్యంలో 8 మంది భాగస్వాములు ఉన్నారని.. వీరిలో ప్రతి ఒక్కరూ ఘటనకు బాధ్యులేనని అన్నారు. లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ ఇంఛార్జి విజయ్ చందర్, సీనియర్ మేనేజర్ నాగరాజును అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ రమేశ్ కుమార్ వెల్లడించారు.

కాగా, సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా భారీగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో వెళ్లిన బాలుడికి సీపీఆర్ చేసిన పోలీసులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సంధ్య ఘటనపై స్పందించిన అల్లు అర్జున్

సంధ్య థియేటర్​ వద్ద చోటుచేసుకున్న ఘటనపై మరోసారి అల్లు అర్జున్ స్పందించారు. తాను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్‌​లో సినిమా చూడటానికి వెళ్లానని తెలిపారు. అయితే థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల తాను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని చెప్పారు. రేవతి చనిపోయారనే విషయం తనకు ఒకరోజు తర్వాత తెలిసిందని.. అయితే, స్పందించడానికి తనకు సమయం పట్టిందని, అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు అల్లు అర్జున్. రేవతి చనిపోవడం బాధగా ఉందన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రూ. 25 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పిన అల్లు అర్జున్.. త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+