13 ఏళ్లుగా అక్రమ నివాసం, రూ.కోటి ఫైన్.. మాఫీ చేయడంతో స్వదేశానికి కూలీ..
ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ప్ వెళ్లిన ఒకతనికి ఆ దేశం జీవితంలో మరచిపోలేని సాయం చేసింది. 13 ఏళ్లు అక్రమంగా తమ దేశంలో ఉన్న మన్నించి వదిలివేసింది. దీంతో అతను రెక్కలు కట్టుకొని స్వదేశంలో వాలిపోయారు. తనను స్వదేశం తీసుకొచ్చేందుకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ ఆయన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఉపాధి కోసం గల్ఫ్..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోతుగొండ మేడీ ఉపాధి కోసం గల్ప్ వెళ్లాడు. అతనికి ఏజెంట్ మాయమాటలు చెప్పాడు. కానీ అక్కడికీ వెళ్లాక మాత్రం.. సరైన పత్రాలు లేవు. 2007లో యూఏఈలో అడుగుపెట్టి.. అక్కడే ఉన్నాడు. అయితే కూలీ, నాలీ చేసుకొని జీవించేవాడు. కానీ కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని తలకిందులు చేసింది.అందులో మేడి కూడా బయటకొచ్చారు. ఎందుకంటే ఉపాధి లేకపోవడంతో ఆయనకు అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కరోనా నేపథ్యంలో బయటకు..
కరోనా విజృంభించడంతో మేడికి పూట గడవటం కష్టంగా మారింది. ఇక బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సంప్రదించాడు. సమస్యను వివరించి, సాయం చేయాలని కోరాడు. దీంతో కాన్సులేట్ అధికారులు యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మొదట్లో నో అన్న తర్వాత సానుకూలంగా స్పందించారు. అతనిని స్వదేశం పంపించే ఏర్పాట్లు చేశారు.

రూ.కోటి ఫైన్..
అయితే 13 ఏళ్ల తమ దేశంలో అక్రమంగా నివసించడంపై భారీగా జరిమానా వేశారు. రూ.కోటి వరకు ఫైన్ కట్టాలని స్పష్టంచేశారు. కానీ అతని వద్ద చిల్లిగవ్వ లేదు. దీంతో కాన్సులేట్ అధికారులు సంప్రదింపులు జరిపారు. అతని పరిస్థితిని చూసి జరిమానా కూడా మాఫీ చేశారు. దీంతో మేడీ.. స్వదేశానికి రెక్కలు కట్టుకొని వాలిపోయారు. తాను స్వదేశం వచ్చేందుకు సాయం చేసిన కాన్సులేట్ అధికారులకు మేడి కృతజ్ఞతలు తెలిపారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications