ఉబేర్ బైకులు
ఉబేర్ బైకులు
హైదరాబాద్: తమ ట్రాన్స్ పోర్ట్ సేవలను బైక్ ట్యాక్సీ రంగానికి కూడా విస్తరించిన ఉబర్.. వచ్చే ఏడాది ఆరంభం నుంచి హైదరాబాదీలకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. రద్దీ బస్సుల టెన్షన్ లేకుండా ఈ బైక్స్ పై సాఫీగా తమ ప్రయాణం కొనసాగించవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం బేగంపేటలోని ప్రగతి భవన్ లో జెండా ఊపి ఉబర్ ట్యాక్సీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉబర్ వ్యవస్థాపకుడు, సీఈఓ ట్రవిస్ కలనిక్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అనంతరం ఉబర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉబర్ మోటో సర్వీసుల ఒప్పందంపై సంతకాలు చేశారు.












Click it and Unblock the Notifications